హయత్ నగర్ కోర్టులో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
హయత్ నగర్ కోర్టులో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
👉 యోగాతో మానసిక ఒత్తిడిలను జయించవచ్చు... న్యాయమూర్తి ప్రియాంక సిరిసిల్లా.
👉 యోగాని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే మంచి ఫలితాలుంటాయి... న్యాయమూర్తి పర్హిన్ బేగం.
👉 యోగ సాధనతో వచ్చే ఆరోగ్యంతో సుధీర్ఘ కాలం పాటు సంపాదించుకోవచ్చు... జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్.
21 జూన్ 12వ అంతర్జాతీయ యోగా డే ను పురస్కరించుకుని Hayathnagar Mandal Legal Services Committee ఆధ్వర్యంలో హయత్ నగర్ జూనియర్ సివిల్ కోర్టు మరియు 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఈరోజు ఏర్పాటు చేసిన యోగ శిక్షణ కార్యక్రమానికి జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ హాజరై యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయించారు.
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక సిరిసిల్లా, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పర్హిన్ బేగంలతో పాటు APP నారని రమేష్, బార్ అద్యక్ష, కార్యదర్శులు... పల్లె లింగం గౌడ్, ఎ. రామ్మోహన్ లతో పాటు పలువురు న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొని యోగ సాధన చేశారు.
ప్రతి సంవత్సరం యోగా డే రోజు తమకు యోగా నేర్పడంతో పాటు డబ్బు, విలువైన సమయం ఆదా చేసుకునే సులువైన ఆరోగ్య చిట్కాలు, ఆహార నియమాలు, సంతోషకర జీవన శైలిని దినచర్యలో భాగం ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్న భావన శ్రీనివాస్ కు బార్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment