అమృతవనంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం
అమృతవనంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం రామన్నపేటలోని అమృతవనం అగ్రిఫామ్ రిసార్ట్‌లో జాగృతి అభ్యుదయ సంఘం మరియు లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమృతవనం అగ్రిఫామ్ రిసార్ట్ వ్యవస్థాపకులు డా. కడారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో వృక్షాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చెట్లను నాటడం ద్వారా పక్షులకు నివాసం కల్పించడంతో పాటు వివిధ రకాల పండ్లు, కాయలు లభిస్తాయని, వాతావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా అవి ఎంతో దోహదపడతాయని తెలిపారు. జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ప్లాస్టిక్ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి, అది వృక్షంగా ఎదిగే వరకు దాని సంరక్షణ బాధ్యతను తీసుకున్నప్పుడే మొక్క నాటినందుకు నిజమైన సార్థకత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ చేతుల మీదుగా మొక్కలు నాటారు. అలాగే వ్యవ...