జూన్ 5 జాగృతి కార్యక్రమాలు

 జూన్ 5 జాగృతి కార్యక్రమాలు

  


జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో జాగృతి అభ్యుదయ సంఘం పలు కార్యక్రమాలు నిర్వహించింది.





ఆటోనగర్ నేషనల్ డీర్ పార్క్ నందు DFO జి.రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు పర్యావరణ హిత వస్తువులను ప్రదర్శించడం జరిగింది. ప్రధానంగా నేడు కాలుష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు కారణమౌతున్న ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రదర్శిస్తూ వాటి ఆవశ్యకతను భావన శ్రీనివాస్ వివరించడం ఐనది. ఖర్చు ఎక్కువనో, శ్రమ కదా అనో, అవి దొరకవు కదా అనే పలు అనుమానాలు, ఆలోచనలతో ఈజీగా దొరికే హానికారక వస్తువుల వాడకం వలన ఎదురయ్యే రోగాలు,  దుష్పరిణామాలు, హాస్పిటల్ బిల్లులతో పోల్చితే మిగిలినవన్నీ చాలా చిన్న విషయాలని, శరీరంలో ఆరోగ్యం లేకుంటే మనశ్శాంతి ఉండదని, జీవితంలో ఏమీ సాధించలేమని అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి ఉన్నారని, ఎంత పోటీ, హడావుడి జీవితాన్ని గడుపుతున్నా ఆరోగ్యం ముఖ్యమని ఈ విషయంలో మీనమేషాలు లెక్కించకుండా పర్యావరణ అనుకూల జీవనశైలి వైపు అడుగులు వేయాలని శ్రీనివాస్ అన్నారు.


16సం.ల పైగా పర్యావరణ పరిరక్షణ కొరకు జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న కార్యక్రమాలను రోహిత్ అభినందించారు.

సమావేశం అనంతరం పార్క్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.


కార్యక్రమంలో శంషాబాద్, ఆమన్ గల్ FDOలు వెంకటయ్య, బాబ్జీ రావు, హయత్ నగర్ FRO సాయి ప్రకాష్, TGPCB RR Uppal RO EE వెంకట్ నర్సు, జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వరరావు, శరత్ నలమార, యాదయ్య యాదవ్, పద్మజ, రమణయ్యలతో పాటు వనస్ధలి పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడు మెండెం లక్ష్మణ్, జిల్లా అటవీశాఖ అధికారులు FROలు, FSOలు, DROలు, BSIలు, PBSలు, పలు కంపెనీల CEOలు, పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


హబ్సిగూడాలో పేరొందిన సాయి సుఖ విష్టాస్ పెరల్ బ్లాక్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ మోహన్, కల్చరల్ సెక్రటరి వైదేహి ల ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు భావన శ్రీనివాస్, యాదా రామలింగేశ్వరరావు, శరత్ నలమార, రమణయ్యలు అతిధులుగా పాల్గొని గ్లోబల్ వార్మింగ్ కు మనిషి ఏ రకంగా కారణమౌతున్నాడు?, పర్యావరణ పరిరక్షణ తక్షణం ఆవశ్యకత గురించిన ప్రసంగాలు, పాటలతో సభికులను చైతన్య పరిచారు. 

పంచ భూతాలను కాలుష్యం నుండి కాపాడుకుంటామంటూ అపార్ట్మెంట్ వాసులతో భావన శ్రీనివాస్ ప్రమాణం చేయించారు.

చిన్నారులు పలు పర్యావరణ పరిరక్షణ నినాదాలతో కూడిన ప్ల కార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో రమణ, డాక్టర్ వంశి, యాదయ్య, భార్గవ, కుమార్, సాగర్, రమేష్, ఉమా మహేశ్వరి, ప్రసన్న లక్ష్మి, సుందరి, మాధవి, రాజ్యలక్ష్మి, కళావతి,  ఉదయ, కనకవల్లి, నివేద, మేధశ్వి , యశ్విత తదితరులు పాల్గొన్నారు.

Comments