Posts

Showing posts from 2026

ప్లాస్టిక్ మనల్ని మింగేస్తోంది

Image
                                                     ప్లాస్టిక్ మనల్ని మింగేస్తోంది 👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కార్యాలయ సహాయక పర్యావరణ ఇంజనీర్ జి.స్వప్న... 👉 ఆదాని సిమెంట్స్ వారి సహకారంతో జాగృతి అభ్యుదయ సంఘం దేవాలయాలకు ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా తిరిగి వాడుకునే పర్యావరణ ఉత్పత్తుల ఉచిత పంపిణీ ప్రారంభం. 👉 నిత్యాన్నదానంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులే వాడుతున్నాము. PCB, జాగృతి అభ్యుదయ సంఘం ఇచ్చిన ప్రోత్సాహంతో తమ దేవాలయంలో సంపూర్ణంగా ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తాము... శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య. 👉ఛైర్మన్ గారి ప్రకటనకు అనుగుణంగా దేవాలయ కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.     పర్యావరణ పరిరక్షణ కోసం 16 సం.ల పైగా కృషి చేస్తు...

జూన్ 5 జాగృతి కార్యక్రమాలు

Image
 జూన్ 5 జాగృతి కార్యక్రమాలు    జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో జాగృతి అభ్యుదయ సంఘం పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఆటోనగర్ నేషనల్ డీర్ పార్క్ నందు DFO జి.రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు పర్యావరణ హిత వస్తువులను ప్రదర్శించడం జరిగింది. ప్రధానంగా నేడు కాలుష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు కారణమౌతున్న ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రదర్శిస్తూ వాటి ఆవశ్యకతను భావన శ్రీనివాస్ వివరించడం ఐనది. ఖర్చు ఎక్కువనో, శ్రమ కదా అనో, అవి దొరకవు కదా అనే పలు అనుమానాలు, ఆలోచనలతో ఈజీగా దొరికే హానికారక వస్తువుల వాడకం వలన ఎదురయ్యే రోగాలు,  దుష్పరిణామాలు, హాస్పిటల్ బిల్లులతో పోల్చితే మిగిలినవన్నీ చాలా చిన్న విషయాలని, శరీరంలో ఆరోగ్యం లేకుంటే మనశ్శాంతి ఉండదని, జీవితంలో ఏమీ సాధించలేమని అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి ఉన్నారని, ఎంత పోటీ, హడావుడి జీవితాన్ని గడుపుతున్నా ఆరోగ్యం ముఖ్యమని ఈ విషయంలో మీనమేషాలు లెక్కించకుండా పర్యా...

కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ

Image
 కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ 👉వేసవిలో కుక్కల దాహం తీర్చితే కరుస్తాయనే భయం లేదు, ప్రకృతి ఆగ్రహించకుండా జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం... బి.ఎన్.రెడ్డి మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి 17/05/'26.      మల్కాజ్ గిరి మునిసిపల్ కార్పొరేషన్ వారు రూపొందించిన సిమెంట్ డాగ్ బౌల్స్ ను జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ అధ్యక్షతన ఎల్.బి.నగర్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేయడమైనది. తేది: 19/04/'26న శ్రీ వెంకటేశ్వర కాలని గణేష్ మండపం, 26/04/'26న హుడాసాయినగర్ కమ్యూనిటీ హాల్, 17/05/'26న నాగోల్ కమ్యూనిటీ హాల్ మరియు సాహెబ్ నగర్ డివిజన్ నాగిరెడ్డి కాలనీలు వేదికలుగా పంపిణీ చేయడమైనది. గత రాత్రి నాగిరెడ్డి కాలనీలో చేసిన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బి.ఎన్.రెడ్డి డివిజన్ మాజీ కార్పోరేటర్ మాట్లాడుతూ కుక్కలు సహజంగా విశ్వాస జంతువులని, సృష్టి లోని ప్రతి జీవి కనీస అవసరం ఐన నీరు, ఆహారం అందిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనుషులదే అని, ప్రకృతిలో భాగమైన కుక్కలకు దాహం వేసిన సందర్భాల్లో నీళ్ళు దొరకక అసహనంతో ఆగ్రహానికి గురై మనుషులను ...

మల్కాజ్ గిరి పోలీస్ కమీషనర్ ను సత్కరించిన జాగృతి అభ్యుదయ సంఘం

Image
 మల్కాజ్ గిరి పోలీస్ కమీషనర్ ను సత్కరించిన జాగృతి అభ్యుదయ సంఘం మల్కాజ్ గిరి పోలీస్ కమీషనరేట్ కు నియమితులైన మొదటి మహిళా కమీషనర్ శ్రీమతి బి.సుమతి IPS బాధ్యతలు చేపట్టిన వెంటనే అర్ధరాత్రి దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో సాధారణ మహిళ వస్త్ర ధారణతో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కారణంగా ఆడవాళ్ళను వేధించే 40మంది పోకిరీలను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సహజంగా సినిమాల్లో మాత్రమే చూసే ఈ డ్రైవ్ నిజ జీవితంలో జరగడం రాత్రి సమయంలో బిక్కు మంటూ అభద్రతా భావంతో విధులు నిర్వహించే మహిళల్లో ఆత్మ స్ధైర్యాన్ని పెంచుతుందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ డ్రైవ్ పెద్ద భరోసానిస్తుందని భావిస్తూ ప్రజల తరపున నేడు జాగృతి అభ్యుదయ సంఘం టీం మల్కాజ్ గిరి లోని CP కార్యాలయంలో CP సుమతిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ ఈ స్పెషల్ డ్రైవ్ ఒక్కరోజుతో ఆగిపోయేది కాదని, తన పరిధిలోని అనుమానిత ప్రాంతాలలో తరచూ ఇలాంటి డ్రైవ్ లు కొనసాగిస్తామని, తన కమీషనరేట్ పరిధిలోని ప్రతి కుటుంబం క్షణ క్షణం భయపడే పరిస్థితి లేకుండా భరోసాతో సంతోషకర జీవితాన్ని గడిపేవిధంగా టెక్నాలజీ ఆధారిత "సురక్షా...

ఆధ్యాత్మిక కేంద్రాలకు చేయూత నివ్వండి

Image
 ఆధ్యాత్మిక కేంద్రాలకు చేయూత నివ్వండి మంచి అలవాట్ల వైపు ప్రజలను ఆకర్షింప చేసేందుకు ఆధ్యాత్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తూ...  హానికారక/ప్రభుత్వ నిషేదిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ వస్తువులను దేవాలయాలకు, ప్రార్ధనా మందిరాలకు తాత్కాలికముగా అందించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర గౌ|| పర్యావరణ, అటవీశాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ ను సచివాలయం లోని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇవ్వడమైనది. మంత్రిగారు సానుకూలంగా స్పందించారు.  ఈ ప్రక్రియ ప్రజల్లో నిజమైన భక్తి భావన పెరగడానికి దోహదపడుతుందని, పలుచని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లలో టెంకాయలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ తదితర పూజా ద్రవ్యాలు, ప్రసాద సామాగ్రి దేవాలయ ప్రాంగణాల్లోకి తీసికెళ్ళడం తగ్గుముఖం పడుతుందని, దేవాలయాల్లో జరిగే అన్నదానాల ప్లేట్లు, ప్రసాదాల పంపిణీకి వినియోగించే ప్లాస్టిక్ డొప్పలు, స్పూన్లు వాడకం తగ్గుతుందని జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్, శ్రీరంగనాథ్ లు ఆశాభావం వ్యక్తం చేశారు.  పరిమితమౌతున్న ప్ర...

ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెగా సైకిల్ ర్యాలీ

Image
 *ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెగా సైకిల్ ర్యాలీ*  సాహెబ్ నగర్, వనస్థలిపురం, ఏప్రిల్ 21:  ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో    మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, జాగృతి ప్రతినిధులు పాల్గొన్న ఈ మెగా ర్యాలీని హయత్ నగర్ మండల విద్యా శాఖాధికారి (MEO) కె.శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.      ఈ సందర్భంగా ఎంఈఓ గారు మాట్లాడుతూ సైకిల్ ర్యాలీ కేవలం పొల్యూషన్ తగ్గించడమే కాకుండా భూమాత సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఒక్క సారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, చెట్ల పెంపకం, సహజ ఎరువులుతో భూసారం పెంచడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని జాగృతి అభ్యుదయ సంఘం సైకిల్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు.        పలు పర్యావరణ పరిరక్షణ నినాదాల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ షుమారు 150మంది విద్యార్థులు పాల్గొన్న మెగా సైకిల్ ర్యాలీ NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమై రైతు బజార్, గణేష్ టెంపుల్, రెడ్ వాటర్ ట్యాంక్,...

సాహెబ్ నగర్ డివిజన్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం

Image
 *సాహెబ్ నగర్ డివిజన్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం* 👉 అన్నదానం కన్నా గొప్పది మండు వేసవిలో జలదానం - దక్షిణ భారత గోరక్షక్ ప్రముఖ్ టి.యాదగిరిరావు. 👉 భగభగ మండుతున్న భానుడి ప్రతాపానికి తడారిపోతున్న గొంతుకల దాహం తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు - శ్రీరామ సేన నవీన్ వల్లోజు  👉 సామాజిక బాధ్యతగా గుర్తెరిగి సాహెబ్ నగర్ డివిజన్ ఇంజాపూర్ రహదారిలో  బాటసారుల, వాహనచోదకుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు - జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్. 👉 వాడిపారేసే ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా, మినరల్ వాటర్ మాత్రమే కాకుండా మజ్జిగ కూడా ఉచిత పంపిణీకి మా వెంకటేశ్వర కాలనీని వేదికగా ఎంచుకున్నందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు, కాలనీ తరపున నా వంతు సహకారం కూడా అందిస్తాను - కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాటి రాంబాబు గౌడ్. 👉 బంకుల్లో పెట్రోల్ కొన్నట్లుగా ట్యాంకుల్లో వాటర్ కొనాల్సి రావడం వలన బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు ఖర్చు కాకూడదనే ఆలోచనతో ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు  అభినందనీయం - డాక్టర్ విజయ్ కుమార్.        సూపర్ ఎల్.నినో ప్రభావంతో మునుపెన్నడూ లేని...