కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ
కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ 👉వేసవిలో కుక్కల దాహం తీర్చితే కరుస్తాయనే భయం లేదు, ప్రకృతి ఆగ్రహించకుండా జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం... బి.ఎన్.రెడ్డి మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి 17/05/'26. మల్కాజ్ గిరి మునిసిపల్ కార్పొరేషన్ వారు రూపొందించిన సిమెంట్ డాగ్ బౌల్స్ ను జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ అధ్యక్షతన ఎల్.బి.నగర్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేయడమైనది. తేది: 19/04/'26న శ్రీ వెంకటేశ్వర కాలని గణేష్ మండపం, 26/04/'26న హుడాసాయినగర్ కమ్యూనిటీ హాల్, 17/05/'26న నాగోల్ కమ్యూనిటీ హాల్ మరియు సాహెబ్ నగర్ డివిజన్ నాగిరెడ్డి కాలనీలు వేదికలుగా పంపిణీ చేయడమైనది. గత రాత్రి నాగిరెడ్డి కాలనీలో చేసిన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బి.ఎన్.రెడ్డి డివిజన్ మాజీ కార్పోరేటర్ మాట్లాడుతూ కుక్కలు సహజంగా విశ్వాస జంతువులని, సృష్టి లోని ప్రతి జీవి కనీస అవసరం ఐన నీరు, ఆహారం అందిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనుషులదే అని, ప్రకృతిలో భాగమైన కుక్కలకు దాహం వేసిన సందర్భాల్లో నీళ్ళు దొరకక అసహనంతో ఆగ్రహానికి గురై మనుషులను ...