వినాయక పత్రి వనం, నక్షత్ర వనం ఏర్పాటుకు గౌ|| ముఖ్యమంత్రికి వినతి

 వినాయక పత్రి వనం, నక్షత్ర వనం ఏర్పాటుకు గౌ|| ముఖ్యమంత్రికి వినతి


👉తెలంగాణ రాష్ట్ర గౌ|| ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ గౌడ్ గారితో కలిసి వినతిపత్రం సమర్పించిన జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్...









*విషయము:* వన మహోత్సవంలో భాగంగా రంగారెడ్డి జిల్లా గుర్రంగూడా 116 ఎకరాల అటవీ శాఖ భూమిలో 21 రకాల వినాయక పత్రివనం, 27 నక్షత్రాల వనం, మట్టి గణపతి విగ్రహాల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తూ హైదరాబాదు ప్రజలకు అందుబాటులోకి తెచ్చుట గురించి...


హిందూ భక్తులు ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో 9 రోజులు జరుపుకునే పెద్ద పండుగ వినాయక చవితి. వినాయక చవితి సందర్భంగా గణపతిని 21 రకాల ఔషధ గుణాలు ఉండే పత్రితో పూజ చేయడం సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఉద్దేశం కూడా సైన్స్ పరమైనదే. ఆ 21 రకాల పత్రిలో ప్రస్తుతం షుమారు 10 రకాలు మాత్రమే హైదరాబాద్ భక్తులకు దొరుకుతున్నవి. 


అంతేకాకుండా ప్రతి హిందువు పుట్టుకకు చెందిన 12 రాశులు, ఆ రాశులకు సంబంధించిన 27 జన్మ నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి చెందిన ఒక్కొక్క మొక్క ఔషధ గుణాలు ఉన్నటువంటిది శాస్త్రంలో నిశ్చయించబడి ఉన్నాయి. వారి వారి జన్మ నక్షత్రానికి చెందిన ఆయా మొక్కలు కూడా అన్నీ దొరకడం లేదు. మరియు ఏటా పెరుగుతున్న పర్యావరణ మట్టి గణపతి విగ్రహాల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉండటం లేదు. కావున ప్రజల ఆరోగ్యము, పర్యావరణ పరిరక్షణ, జల కాలుష్యంలతో ముడిపడి ఉన్న... 


21 రకాల పత్రి చెట్లను గుర్రంగూడా అటవీ భూమిలో ప్రభుత్వం పెంచుతూ వినాయక పత్రిని, ఆయా నక్షత్రాల 27 రకాల ఔషధీయ మొక్కలను పెంచుతూ, మట్టి గణపతి విగ్రహాల తయారీ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంత వాసులకు అందుబాటులోకి తెచ్చి ఆరోగ్యంతో కూడిన ఆహ్లాదానుభూతిని పంచే పచ్చని ప్రకృతిని మన తెలంగాణ ప్రజలకు అందించవలసిందిగా గుర్రంగూడాలో జరిగిన వన మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మధుయాష్కీ గౌడ్ తో కలిసి వినతి పత్రం ఇవ్వడమైనది.










పత్రం నకలును టిజి ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (HOFF) డాక్టర్ సువర్ణ, IFS గారికి అందించగా పర్యావరణ పరిరక్షణకు మీకు మంచి ఆలోచనలు ఉన్నాయంటూ జాగృతి బృందాన్ని అభినందిస్తూ సానుకూలంగా స్పందించారు.




       వినతి పత్రాలు సమర్పించిన వారిలో జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ తో పాటు ప్రతినిధులు శ్రీరంగనాధ్, ఈడిగ శ్రీరాములు గౌడ్, యాదా రామలింగేశ్వరరావు, ఆనబత్తుల సత్యనారాయణ,  ఇస్మాయిల్ గురూజీ, అఖిల్ భాస్కరుని, గోపాల్ దాస్ రాము, మంగపతిరావు, కె.వి.రమణయ్య, బి.ఎన్ రెడ్డి డివిజన్ కాంగ్రెస్ నాయకులు పి.గణేష్ రెడ్డి తదితరులు ఉన్నారు...

భావన శ్రీనివాస్ 

ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం.

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025