Posts

Showing posts from June, 2026

పండ్ల చెట్లతోనే జీవ వైవిధ్యం కాపాడబడుతుంది

Image
 పండ్ల చెట్లతోనే జీవ వైవిధ్యం కాపాడబడుతుంది 👉లయన్ పాప వెంకటరెడ్డి గారి 52 వ జన్మదినం సందర్భంగా 52 పండ్ల చెట్లు నాటేందుకు శ్రీకారం 👉లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలిపురం, జాగృతి అభ్యుదయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో  నాగిరెడ్డి కాలని వీధులలో సంక్షేమ సంఘంవారి సహకారంతో పెద్ద సైజ్ పండ్ల మొక్కలను నాటి సంరక్షణ గార్డులు ఏర్పాటు. 👉 నాటిన మొక్కలను నీరు పోసి సంరక్షిస్తామని కంకణ ధారణ చేసి ప్రమాణం చేసిన కాలనీ వాసులు, సంక్షేమ సంఘం ప్రతినిధులు.        విష రసాయనాలతో పండించిన పండ్లు తినడం వలన ఎదురయ్యే అనారోగ్య సమస్యలను అధిగమించడంతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణకు పండ్ల చెట్లు పెంచడం అవసరం అని భావించి గత కొన్ని సంవత్సరాలుగా ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో కొన్ని వందల పండ్ల చెట్లు నాటి దత్తతనిస్తూ పెంచుతున్న జాగృతి అభ్యుదయ సంఘం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్ధలిపురంతో కలిసి సాహెబ్ నగర్ డివిజన్ నాగిరెడ్డి కాలనీలో సంక్షేమ సంఘం వారి సహకారంతో పండ్ల చెట్లు నాటడమైనది.,  పోలీస్ కాలని ఆంజనేయ స్వామి దేవాలయం పూజారి ఈశ్వర శర్మ గారి ఆశీర్వచనంతో లయన్ పాప వెంకటరెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలను ఆరోగ్యాన్నిచ్చే...

హయత్ నగర్ కోర్టులో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

Image
  హయత్ నగర్ కోర్టులో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు 👉 యోగాతో మానసిక ఒత్తిడిలను జయించవచ్చు... న్యాయమూర్తి ప్రియాంక సిరిసిల్లా. 👉 యోగాని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే మంచి ఫలితాలుంటాయి... న్యాయమూర్తి పర్హిన్ బేగం. 👉  యోగ సాధనతో వచ్చే ఆరోగ్యంతో సుధీర్ఘ కాలం పాటు సంపాదించుకోవచ్చు...  జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్.        21 జూన్ 12వ అంతర్జాతీయ యోగా డే ను పురస్కరించుకుని  Hayathnagar Mandal Legal Services Committee ఆధ్వర్యంలో హయత్ నగర్ జూనియర్ సివిల్ కోర్టు మరియు 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఈరోజు ఏర్పాటు చేసిన యోగ శిక్షణ కార్యక్రమానికి జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ హాజరై యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక సిరిసిల్లా, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పర్హిన్ బేగంలతో పాటు APP నారని రమేష్, బార్ అద్యక్ష, కార్యదర్శులు... పల్లె లింగం గౌడ్, ఎ. రామ్మోహన్ లతో పాటు పలువురు న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొని యోగ సాధన చేశారు. ప్రతి సంవత్సరం యోగా డే రోజు తమకు యోగా నే...

వినాయక పత్రి వనం, నక్షత్ర వనం ఏర్పాటుకు గౌ|| ముఖ్యమంత్రికి వినతి

Image
 వినాయక పత్రి వనం, నక్షత్ర వనం ఏర్పాటుకు గౌ|| ముఖ్యమంత్రికి వినతి 👉తెలంగాణ రాష్ట్ర గౌ|| ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ గౌడ్ గారితో కలిసి వినతిపత్రం సమర్పించిన జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్... *విషయము:* వన మహోత్సవంలో భాగంగా రంగారెడ్డి జిల్లా గుర్రంగూడా 116 ఎకరాల అటవీ శాఖ భూమిలో 21 రకాల వినాయక పత్రివనం, 27 నక్షత్రాల వనం, మట్టి గణపతి విగ్రహాల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తూ హైదరాబాదు ప్రజలకు అందుబాటులోకి తెచ్చుట గురించి... హిందూ భక్తులు ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో 9 రోజులు జరుపుకునే పెద్ద పండుగ వినాయక చవితి. వినాయక చవితి సందర్భంగా గణపతిని 21 రకాల ఔషధ గుణాలు ఉండే పత్రితో పూజ చేయడం సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఉద్దేశం కూడా సైన్స్ పరమైనదే. ఆ 21 రకాల పత్రిలో ప్రస్తుతం షుమారు 10 రకాలు మాత్రమే హైదరాబాద్ భక్తులకు దొరుకుతున్నవి.  అంతేకాకుండా ప్రతి హిందువు పుట్టుకకు చెందిన 12 రాశులు, ఆ రాశులకు సంబంధించిన 27 జన్మ నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి చెందిన ఒక్కొక్క మొక్క ఔషధ గుణాలు ఉన్నటువంటిది శాస్త్రంలో నిశ్చయించబడి ఉ...

ప్లాస్టిక్ మనల్ని మింగేస్తోంది

Image
                                                     ప్లాస్టిక్ మనల్ని మింగేస్తోంది 👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కార్యాలయ సహాయక పర్యావరణ ఇంజనీర్ జి.స్వప్న... 👉 ఆదాని సిమెంట్స్ వారి సహకారంతో జాగృతి అభ్యుదయ సంఘం దేవాలయాలకు ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా తిరిగి వాడుకునే పర్యావరణ ఉత్పత్తుల ఉచిత పంపిణీ ప్రారంభం. 👉 నిత్యాన్నదానంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులే వాడుతున్నాము. PCB, జాగృతి అభ్యుదయ సంఘం ఇచ్చిన ప్రోత్సాహంతో తమ దేవాలయంలో సంపూర్ణంగా ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తాము... శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య. 👉ఛైర్మన్ గారి ప్రకటనకు అనుగుణంగా దేవాలయ కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.     పర్యావరణ పరిరక్షణ కోసం 16 సం.ల పైగా కృషి చేస్తు...