Posts

Showing posts from April, 2026

ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెగా సైకిల్ ర్యాలీ

Image
 *ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెగా సైకిల్ ర్యాలీ*  సాహెబ్ నగర్, వనస్థలిపురం, ఏప్రిల్ 21:  ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో    మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, జాగృతి ప్రతినిధులు పాల్గొన్న ఈ మెగా ర్యాలీని హయత్ నగర్ మండల విద్యా శాఖాధికారి (MEO) కె.శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.      ఈ సందర్భంగా ఎంఈఓ గారు మాట్లాడుతూ సైకిల్ ర్యాలీ కేవలం పొల్యూషన్ తగ్గించడమే కాకుండా భూమాత సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఒక్క సారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, చెట్ల పెంపకం, సహజ ఎరువులుతో భూసారం పెంచడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని జాగృతి అభ్యుదయ సంఘం సైకిల్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు.        పలు పర్యావరణ పరిరక్షణ నినాదాల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ షుమారు 150మంది విద్యార్థులు పాల్గొన్న మెగా సైకిల్ ర్యాలీ NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమై రైతు బజార్, గణేష్ టెంపుల్, రెడ్ వాటర్ ట్యాంక్,...

సాహెబ్ నగర్ డివిజన్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం

Image
 *సాహెబ్ నగర్ డివిజన్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం* 👉 అన్నదానం కన్నా గొప్పది మండు వేసవిలో జలదానం - దక్షిణ భారత గోరక్షక్ ప్రముఖ్ టి.యాదగిరిరావు. 👉 భగభగ మండుతున్న భానుడి ప్రతాపానికి తడారిపోతున్న గొంతుకల దాహం తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు - శ్రీరామ సేన నవీన్ వల్లోజు  👉 సామాజిక బాధ్యతగా గుర్తెరిగి సాహెబ్ నగర్ డివిజన్ ఇంజాపూర్ రహదారిలో  బాటసారుల, వాహనచోదకుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు - జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్. 👉 వాడిపారేసే ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా, మినరల్ వాటర్ మాత్రమే కాకుండా మజ్జిగ కూడా ఉచిత పంపిణీకి మా వెంకటేశ్వర కాలనీని వేదికగా ఎంచుకున్నందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు, కాలనీ తరపున నా వంతు సహకారం కూడా అందిస్తాను - కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాటి రాంబాబు గౌడ్. 👉 బంకుల్లో పెట్రోల్ కొన్నట్లుగా ట్యాంకుల్లో వాటర్ కొనాల్సి రావడం వలన బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు ఖర్చు కాకూడదనే ఆలోచనతో ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు  అభినందనీయం - డాక్టర్ విజయ్ కుమార్.        సూపర్ ఎల్.నినో ప్రభావంతో మునుపెన్నడూ లేని...

పర్యావరణ హితంగా శ్రీ సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ

Image
 జాగృతి అభ్యుదయ సంఘం, వాసవి క్లబ్ మరియు వాసవి వనిత సంయుక్త ఆధ్వర్యంలో సాహెబ్ నగర్  NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ తేదీ 04/04/2026 శనివారం ఉదయం 9:00 గo. లకు జరిగినది. కార్యక్రమంలో అల్పాహారం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మరియు టీ స్టీల్ గ్లాసులలలో ఇవ్వడం జరిగింది.  పూలు, పూజా సామాగ్రి మొత్తం ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులలో కాకుండా తిరిగి వాడుకునే సంచులలోనే క్యారీ చేయడం జరిగింది.  కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, దాతలకు చేనేత కండువాలను శాలువాగా కప్పి తిరిగి వాడుకునే బ్యాంబూ, స్టీల్, మట్టి వాటర్ బాటిల్స్, బట్ట సంచులను, నాచురల్ రూమ్ ఫ్రెషనర్ లను, విద్యార్థులకు పండ్లను  ఇవ్వడమైనది. కార్యక్రమం అంతా పర్యావరణహితంగా జరిగినది.