ఆధ్యాత్మిక కేంద్రాలకు చేయూత నివ్వండి

 ఆధ్యాత్మిక కేంద్రాలకు చేయూత నివ్వండి

మంచి అలవాట్ల వైపు ప్రజలను ఆకర్షింప చేసేందుకు ఆధ్యాత్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తూ...  హానికారక/ప్రభుత్వ నిషేదిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ వస్తువులను దేవాలయాలకు, ప్రార్ధనా మందిరాలకు తాత్కాలికముగా అందించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర గౌ|| పర్యావరణ, అటవీశాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ ను సచివాలయం లోని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇవ్వడమైనది. మంత్రిగారు సానుకూలంగా స్పందించారు.












 ఈ ప్రక్రియ ప్రజల్లో నిజమైన భక్తి భావన పెరగడానికి దోహదపడుతుందని, పలుచని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లలో టెంకాయలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ తదితర పూజా ద్రవ్యాలు, ప్రసాద సామాగ్రి దేవాలయ ప్రాంగణాల్లోకి తీసికెళ్ళడం తగ్గుముఖం పడుతుందని, దేవాలయాల్లో జరిగే అన్నదానాల ప్లేట్లు, ప్రసాదాల పంపిణీకి వినియోగించే ప్లాస్టిక్ డొప్పలు, స్పూన్లు వాడకం తగ్గుతుందని జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్, శ్రీరంగనాథ్ లు ఆశాభావం వ్యక్తం చేశారు. 

పరిమితమౌతున్న ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోవడం కూడా దినచర్యలో భాగం చేసుకోవాల్సిన పరిస్ధితులొచ్చాయని వారన్నారు.

Comments