కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ

 కుక్కలకు నీళ్ళతొట్లు ఉచిత పంపిణీ

👉వేసవిలో కుక్కల దాహం తీర్చితే కరుస్తాయనే భయం లేదు, ప్రకృతి ఆగ్రహించకుండా జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం... బి.ఎన్.రెడ్డి మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి 17/05/'26.

     మల్కాజ్ గిరి మునిసిపల్ కార్పొరేషన్ వారు రూపొందించిన సిమెంట్ డాగ్ బౌల్స్ ను జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ అధ్యక్షతన ఎల్.బి.నగర్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేయడమైనది.





తేది: 19/04/'26న శ్రీ వెంకటేశ్వర కాలని గణేష్ మండపం, 26/04/'26న హుడాసాయినగర్ కమ్యూనిటీ హాల్, 17/05/'26న నాగోల్ కమ్యూనిటీ హాల్ మరియు సాహెబ్ నగర్ డివిజన్ నాగిరెడ్డి కాలనీలు వేదికలుగా పంపిణీ చేయడమైనది.



గత రాత్రి నాగిరెడ్డి కాలనీలో చేసిన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బి.ఎన్.రెడ్డి డివిజన్ మాజీ కార్పోరేటర్ మాట్లాడుతూ కుక్కలు సహజంగా విశ్వాస జంతువులని, సృష్టి లోని ప్రతి జీవి కనీస అవసరం ఐన నీరు, ఆహారం అందిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనుషులదే అని, ప్రకృతిలో భాగమైన కుక్కలకు దాహం వేసిన సందర్భాల్లో నీళ్ళు దొరకక అసహనంతో ఆగ్రహానికి గురై మనుషులను కరవడం జరుగుతుందని, అవి కరవకుండా ఉండేందుకు నీళ్ళతొట్లు పంపిణీ హర్షణీయం అని, బౌల్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ వాటిని ఇంటి బయట ఉంచి ప్రతి నిత్యం నీళ్ళు పోయాలని, అలా చేయడం వలన వీధి కుక్కలు సైతం మనుషులకు మచ్చిక అవుతాయని, అవి కరుస్తాయనే భయం ఉండదని అన్నారు.







కుక్కలను కాలభైరవుడిగా, గౌరీ దేవిగా కొలుస్తామని, దుర్గాదేవికి సింహం, అయ్యప్ప స్వామికి పులి, కుమార స్వామికి నెమలి, యముడికి దున్నపోతు, శివుడికి నందిగా ఎద్దు, వెంకటేశ్వర స్వామికి గరుత్మంతుడుగా గద్ద, సూర్యునికి గుర్రాలు ఇలా మనం భగవంతునిగా కొలిచే ప్రతి దేవుడికి ఆయా జంతువులు, పక్షులు వాహనాలుగా ప్రకటిస్తూ ప్రకృతిలోని జీవులతో మనిషి అనుబంధాన్ని విడదీయలేమనే సంకేతాన్ని మన పూర్వీకులు చక్కగా మనకు అందించి ఉన్నారని, దానినే ఇప్పుడు సైన్స్ పరిభాషలో "బయోడైవర్సిటీ" అని శాస్త్రవేత్తలు పరిశోధనలు ద్వారా నిర్ధారణ చేసి కాపాడుకోవాలంటూ ప్రభుత్వ చట్టాలు కూడా చేసి ఉన్నాయని, కుక్కలు కరవడాన్ని ప్రకృతి ఆగ్రహంగా గుర్తించి కాపాడుకునే చర్యలు చేపట్టాలని జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ అన్నారు.























పంపిణీ కార్యక్రమాల్లో గోపాల్ దాస్ రాము, శ్రీ వెంకటేశ్వర కాలని అధ్యక్షులు రాంబాబు గౌడ్, ద్వారకామయి నగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సునీల్, సతీష్, నాగోల్ వివేకానంద ట్రస్ట్ శ్రీనివాసులు, నాగిరెడ్డి కాలని ప్రతినిధులు పూల్ సింగ్, గూడూరు వెంకటేష్ గౌడ్, కె.సోమయాజులు, పద్మావతి, వెంకటేష్, రఘునాధ్ యాదవ్, సాహెబ్ నగర్ డివిజన్ కాలనీల ప్రతినిధులు నందిరాజు లక్ష్మీనారాయణ, మనోజ్ గౌరిశెట్టి, భవాని సరస్వతి, నాగేందర్, ప్రశాంత్ గౌడ్, శశికాంత్, డాక్టర్ రాము, ఆంజనేయులు, నందకిషోర్, సూర్యానాయక్, కిరణ్, దయాకర్, చంద్రకాంత్,  దయాకర్ ముదిరాజ్, రాంబాబు నాయక్, జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వ‌‌రావు శృంగవరపు శ్రీనివాస్, శరత్ నలమార, ఆనబత్తుల సత్యనారాయణ, బాలాజి, కె.వి.రమణయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025