మల్కాజ్ గిరి పోలీస్ కమీషనర్ ను సత్కరించిన జాగృతి అభ్యుదయ సంఘం
మల్కాజ్ గిరి పోలీస్ కమీషనర్ ను సత్కరించిన జాగృతి అభ్యుదయ సంఘం
మల్కాజ్ గిరి పోలీస్ కమీషనరేట్ కు నియమితులైన మొదటి మహిళా కమీషనర్ శ్రీమతి బి.సుమతి IPS బాధ్యతలు చేపట్టిన వెంటనే అర్ధరాత్రి దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో సాధారణ మహిళ వస్త్ర ధారణతో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కారణంగా ఆడవాళ్ళను వేధించే 40మంది పోకిరీలను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సహజంగా సినిమాల్లో మాత్రమే చూసే ఈ డ్రైవ్ నిజ జీవితంలో జరగడం రాత్రి సమయంలో బిక్కు మంటూ అభద్రతా భావంతో విధులు నిర్వహించే మహిళల్లో ఆత్మ స్ధైర్యాన్ని పెంచుతుందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ డ్రైవ్ పెద్ద భరోసానిస్తుందని భావిస్తూ ప్రజల తరపున నేడు జాగృతి అభ్యుదయ సంఘం టీం మల్కాజ్ గిరి లోని CP కార్యాలయంలో CP సుమతిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ ఈ స్పెషల్ డ్రైవ్ ఒక్కరోజుతో ఆగిపోయేది కాదని, తన పరిధిలోని అనుమానిత ప్రాంతాలలో తరచూ ఇలాంటి డ్రైవ్ లు కొనసాగిస్తామని, తన కమీషనరేట్ పరిధిలోని ప్రతి కుటుంబం క్షణ క్షణం భయపడే పరిస్థితి లేకుండా భరోసాతో సంతోషకర జీవితాన్ని గడిపేవిధంగా టెక్నాలజీ ఆధారిత "సురక్షా" లింక్ ను క్రియేట్ చేసి డేటా సేకరిస్తామని, ఆ లింక్ ఆధారంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో ఆ సమాచారం డిపార్ట్మెంట్ కు చేరుతుందని, ఆలస్యం కాకుండా స్పందించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నిషేదిత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, డ్రగ్స్ విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని, డ్రగ్స్ అమ్మకందారుల సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
CPని కలిసిన వారిలో భావన శ్రీనివాస్, శ్రీరంగనాథ్, కె.వి.రమణయ్య, వేమారెడ్డిలు ఉన్నారు.
Comments
Post a Comment