06-12-2023పోలీస్ అధికారులకు జాగృతి అభ్యుదయ సంఘం ఘన సన్మానం

                           పోలీస్ అధికారులను సత్కరిస్తున్న భావన శ్రీనివాస్ తదితరులు 







 పోలీస్ అధికారులకు జాగృతి అభ్యుదయ సంఘం ఘన సన్మానం


2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వనస్ధలిపురం ACP డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ పనితీరుని ప్రశంసిస్తూ గతరాత్రి వనస్ధలిపురం ACP కార్యాలయంలో Asst.Commissioner of Police శ్రీ భీం రెడ్డి, వనస్ధలిపురం Circle Inspector శ్రీ డి.జలంధర్ రెడ్డి గార్లను దుశ్శాలువాలు , పర్యావరణ బట్ట సంచులు, మెమెంటోలతో జాగృతి అభ్యుదయ సంఘం బృందం ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్భంగా ACP గారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన డివిజన్ పరిధిలోని వనస్ధలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్,మీర్ పేట సర్కిల్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రతి ఒక్క ఓటరు, ఎన్నికల విధులు నిర్వహించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా తమ సిబ్బంది సహకారంతో శాంతి భద్రతలను పరిరక్షించగలిగామని అన్నారు.

   ప్రతి ఒక్కరూ 'నాకేంటి' అనుకునే ప్రస్తుత పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఎన్నికల సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు నిస్వార్థంగా నిర్వహించిన Right Vote Challenge కార్యక్రమాలు...

"బాధ్యతగా ఓటెయ్యండి, ఓటింగ్ శాతం పెంచండి",

 "ప్రలోభాలకు లొంగకండి, బానిసలుగా మారకండి" అంటూ ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమంతో పాటు MLAఅభ్యర్ధుల ఖర్చుల భారం తగ్గించుకోవాలంటూ చేసిన ప్రచార కార్యక్రమాలు అభినందనీయమని, కొంచెం ఆలస్యం ఐనా మీ ప్రయత్నం ప్రజలను చేరుకుని సత్ఫలితాలు సాధిస్తుందని, అక్కడక్కడా మీ బోటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారు ఇంకా ఉండబట్టే సమాజం ఇంకా నిలదొక్కుకుని కొంతమేరకు ప్రశాంతంగా మనుగడ సాగిస్తుందని, ధర్మం 4 పాదాల నిలబడుతుందనే ఆశలు చిగురిస్తున్నాయని అన్నారు. 


    ఎక్కడ ఏం జరుగుతుందో అని భయంతో, అభద్రతా భావంతో బిక్కు బిక్కు మంటూ కాలం గడిపే ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపి ధైర్యంగా, స్వతంత్రంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోగలగటానికి పోలీస్ శాఖ పాత్ర కీలకమని, వనస్ధలిపురం ACP తమ సిబ్బంది సహకారంతో ఆయా విధులు ఎంతో సమర్ధతతో, అంకితభావంతో, అహర్నిశలు శ్రమించి శాంతి భద్రతలను పరిరక్షించి బాధ్యతగా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపి ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకునే వాతావరణం కల్పించినందుకుగాను ప్రజలందరి తరపున కృతజ్ఞతగా వనస్ధలిపురం డివిజన్ పోలీస్ వారికి ఈ సత్కారం చేయడం జరిగిందని జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ అన్నారు.

    కార్యక్రమంలో SI జగన్, జాగృతి కార్యదర్శి శ్రీరంగనాధ్, ఇస్మాయిల్ గురూజి,యాదా రామలింగేశ్వరరావు, సీతారామ శర్మ, ఓబులేష్ యాదవ్, లక్ష్మణరావు, రామకృష్ణ, వేమారెడ్డి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- భావన శ్రీనివాస్

ఫౌండర్ & చైర్మన్ జాగృతి అభ్యుదయ సంఘం

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.