WELCOMING GHMC SARKAR 3
GHMC హయత్ నగర్ సర్కిల్ 3 నూతన ఉప కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పుప్పాల రవికుమార్
స్వాగతం పలికిన జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు💐
GHMC హయత్ నగర్ సర్కిల్ 3 కు నిన్నటి వరకు ఉపకమీషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ ఎ.మారుతి దివాకర్ గారు అంబర్ పేట సర్కిల్ కు బదిలీ కాగా వారి స్ధానంలో కూకట్ పల్లి నుండి బదిలీ అయిన శ్రీ పుప్పాల రవికుమార్ సర్కిల్ 3 కు DC గా నియమితులైనారు.
ఈరోజు వారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు భావన శ్రీనివాస్,గోపాల్ దాస్ రాము,ఇస్మాయిల్ గురూజీలు కలిసి వారిని ఘనంగా స్వాగతించడం జరిగినది.
ఈ సందర్భంగా నూతన కమీషనర్ రవికుమార్ జాగృతి బృందంతో ముచ్చటిస్తూ హయత్ నగర్ సర్కిల్ లోని 4డివిజన్ల ప్రజలకు ఎటువంటి సామాజిక సమస్యలు తలెత్తినా, అవసరాలు ఏర్పడినా నేరుగా తన చరవాణి సంఖ్య: 9989930195 కు ఒక మెసేజ్ ద్వారా తెలియచేయాలన్నారు.
దాదాపు మూడున్నర సంవత్సరాలుగా తనకు అన్ని విధాలుగా సహకరించిన సర్కిల్ ప్రజలకు, కాలనీ సంక్షేమ సంఘాల, స్వచ్ఛంద సంస్థల, వివిధ స్ధాయిల సిబ్బందికి మారుతి దివాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment