VEGETABLE PLANTAION
వానాకాలంలో ముచ్చెమటలు పట్టిస్తున్న టమాటా
ఇంకొకరిని నిందించే కంటే....
నేడు టమాటా ధర పెరుగుతూ ఉంది
డేటా ధర తగ్గుతూ ఉంది.
మనిషికి నిత్యం అవసరమైన కూరగాయల ధరలు ఆకాశాన్ని మించి పోతున్నాయి, కావొచ్చు.
పెరిగిన ధరలు తగ్గుముఖం పట్టాలంటే ఫలితం లేని ఆందోళనలు, గందరగోళాలు, గగ్గోలు పెట్టే కంటే మనమే ఒక అడుగు ముందుకేసి పరిష్కారం కోసం "వావ్" అనిపించే ఈ చిన్న ప్రయత్నం అద్భుతమైన సత్ఫలితాలని ఖచ్చితంగా ఇస్తుంది.
నేటి హడావుడి యాంత్రిక జీవితంలో 24 గంటల సమయం చాలక కొన్ని పనులు స్వయంగా చేసుకోలేకపోవడం సర్వసాధారణమౌతుంది, కానీ తప్పనిసరి అనుకున్న పనులకు సమయం కేటాయిస్తూ ఒకే సమయంలో రెండు మూడు పనులు ఎలా చెయ్యొచ్చు అనే దాని గురించే అందరి ఆలోచన.
దానిలో భాగమే ఈ వావ్, వారేవా, శెభాష్ అనిపించే ఐడియా.
రోజులో ఒక గంట సమయం కేటాయిస్తే చాలు,
*డబ్బు ఆదాతో పాటు ధరలు పెరుగుదల గురించిన ఆందోళన అవసరం లేదు
*శరీరానికి శ్రమ(వ్యాయామం) ఫలితంగా ఆరోగ్యం
*అనారోగ్య కారక కృత్రిమ ఎరువుల నుండి విముక్తి
*ఇంటిల్లిపాది తృప్తితో కూడిన కడుపాకలి తీర్చుకోగలగడం
*కూరగాయల కొనుగోలు కోసం ఇంటినుండి బయటికి సుదూరం వెళ్ళే భారం లేదు
ఇవన్నీ ఎలా సాధ్యం అంటారా...
అదే
"మన ఇంటి పంట"
కొంచెం దృష్టి పెడితే చాలు నగర జీవికి ఎంతో మేలు...
*రోజూ ఆరోగ్యం కోసం ఉదయాన్నే మురుగు కంపుకొట్టే రోడ్ల వెంట ఏ నడకో,వ్యాయామము చేసే అవసరం లేకుండా మన ఇంటి డాబా పైనే కొద్దిగా పెట్టుబడి, శారీరక శ్రమతో కూరగాయల మడులు ఏర్పాటు చేసుకుని ఆవుపేడ, కూరగాయల తొక్కలు,కొబ్బరి పీచు లాంటి సహజ ఎరువులతో కూరగాయలు పండించుకుని తిన గలిగితే ఎంతో సంతోషం.
"ఒక దెబ్బకు రెండు పిట్టలు పాత సామెత"
ఇక్కడ ఒక్క పనికి ఎన్ని లాభాలో చూడండి ...ఆలోచించండి, ఆచరణకై ఒక అడుగు ముందుకేసి పని మొదలు పెట్టండి. ఫలితాల సారం ఆస్వాదిస్తారు మీరే
నమస్తే
మేలుకుంటే కోలుకుంటాం!!
మీ
భావన శ్రీనివాస్
ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం
Comments
Post a Comment