HARITHA HARAM IN SCHOOL
భావితరాల భవితవ్యానికై ఇంకొంత పచ్చదనాన్ని పెంచుదాం
ఈరోజు కర్మన్ ఘాట్
Discovery oaks international school
లో జరిగిన "Grow More Green" కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ మరియు లక్ష్మీశర్మ గారు పాల్గొని పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. బంగారు భవిష్యత్ కై చిన్నతనం నుండే పర్యావరణ అనుకూల జీవన శైలిని అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరి పుట్టినరోజున ఒక మొక్క నాటి ప్రతి సంవత్సరం తనతో పాటు ఆ మొక్కకి కూడా పుట్టిన రోజు జరపాలని అలా తనతోపాటు పెంచిన మొక్క పెద్ద చెట్టుగా మారి మనిషితో పాటు జీవరాశికి అవసరమైన ప్రాణవాయువుని, ఆహారాన్ని, నీడను, మందులను, ఆశ్రయాన్ని,కలప, వంటచెరకును, వర్షాలను ఇస్తుందని,అంతేకాకుండా కాలుష్య నియంత్రణ జరిగి అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతుందని అన్నారు.
కార్యక్రమం చివర్లో విద్యార్ధులకు వివిధ రకాల 150 పూలు, ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడమైనది., స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి నిర్మల మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకు అహర్నిశలు పాటుపడుతున్న భావన శ్రీనివాస్ ప్రయత్నాన్ని అభినందించారు, ప్రతి సంవత్సరం వారికి మొక్కలనిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment