FRUIT PLANT PLANTATION
మొక్కకు పోద్దాం నీరు-దూరం చేద్దాం మన కన్నీరు
జాగృతి అభ్యుదయ సంఘం "వనం-మనం" పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులతో ప్రమాణం చేయించిన ముఖ్య అతిథులు వనస్థలిపురం CI శ్రీ దేప జలంధర్ రెడ్డి, GHMC హయత్ నగర్ సర్కిల్ 3 ఉప కమీషనర్ శ్రీ ఎ.మారుతి దివాకర్ లు
జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ సభాద్యక్షతన ఈరోజు బి.ఎన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు "పర్యావరణం-మానవనైజం" అవగాహనా చైతన్య కార్యక్రమం నిర్వహించడమైనది, అనంతరం కాలనీ వీధుల్లో పెద్ద ఎత్తున పెద్ద సైజ్ పండ్ల మొక్కలు నాటి సంరక్షణా గార్డులు ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా CI జలంధర్ రెడ్డి మాట్లాడుతూ... పర్యావరణాన్ని/ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కోట్ల రూపాయల ఆస్తి అని, ఆక్సిజన్ ని కృత్రిమంగా కొనుక్కోవాల్సిన అవసరం రాకూడదని, మొక్కలను విరివిగా పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ చేపట్టాలని...
*నేను .... భూమాత బిడ్డను,
మట్టి నాకు శరీరాన్ని ఇచ్చింది,
నీరు నాకు రక్తాన్ని ఇచ్చింది,
గాలి నాకు శ్వాసను ఇచ్చింది,
అగ్ని నాకు ఆయువును ఇచ్చింది,
ఆకాశం నాకు ఆలోచనను ఇచ్చింది,
ఈ పంచభూతాలనుండి పుట్టిన నేను
వాటి పైనే ఆధారపడుతున్న నేను
తిరిగి వాటికి ఏమివ్వగలను
వాటిని కాపాడుతూ జీవించడం తప్ప
ఈ రోజు నుండి నేను...
చేసే ప్రతి పని గాలి, నీరు, మట్టి కలుషితం చేయకుండా జీవిస్తానని
నా పిల్లలకు కాలుష్యం లేని సమాజాన్ని అందిస్తానని
బాధ్యత గల పౌరుడిగా జీవిస్తానని
సమాజ శ్రేయస్సుకు పాటు పడతానని
పుడమి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను
జై భూమాత .... జై గోమాత ... జై భారత్ మాత
అంటూ సభికులచే ప్రమాణం చేయించడమైనది.
GHMC C3 ఉప కమీషనర్ శ్రీ మారుతి దివాకర్ మాట్లాడుతూ... నాటిన రెండు సంవత్సరాల్లోనే పండ్లు కాసేంత పెద్ద సైజ్ మొక్కలు ఖరీదైనవి డబ్బు పెట్టి కొని నాటడం అభినందనీయమని, సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న భావన శ్రీనివాస్ ను సమాజం గుర్తించి డాక్టరేట్ పట్టా ఇవ్వాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి అతిధులుగా వనస్థలిపురం SI జగన్, లైట్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్రీమతి శ్యామలాదేవి, అష్టలక్ష్మీ మహిళా మండలి అధ్యక్షులు శ్రీమతి ఈపూరి రాజ్యలక్ష్మి, సాయిశాంతి సేవాసమితి అధ్యక్షులు శ్రీమతి ఎర్రం పూర్ణశాంతి, కాలనీ మాజీ, ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి మారుతమ్మ, సరస్వతిలు, VKF ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీమతి క్రిష్ణవేణి, ప్రముఖ యోగా గురువు శ్రీ ఇస్మాయిల్ గురూజి, NRI శ్రీమతి గజవాడ అనుపమ గార్లు విచ్చేయగా గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ ప్రతినిధులు S.రవికుమార్, ఉపేందర్, కామేష్, రమేష్, రవీందర్ గుప్త, గురుశేఖర్ రెడ్డి, మూర్తి, విల్సన్, మనోహర్, సూర్యకుమారి, న్యాయవాది శ్రీనివాస్, నరసింహారావు, శ్రీరాములు, శ్రీనివాసరాజు, శ్రీమతి లక్ష్మి శర్మ, జంగయ్య, మహేందర్, అంజిరెడ్డి,
దాతలు జాగృతి వాలంటీర్లు ఐన రిషిత్, సిద్దార్థ, జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వరరావు, గోపాల్ దాస్ రాము, రఘనాధ్ యాదవ్, మంగపతిరావు, మల్లారెడ్డి, బాలాజి నాయుడు, వెంకటేష్, శ్రీధర్ శర్మ, నంబూరు తాతయ్య, గుద్దేటి నర్సింహులు, లక్ష్మణరావు, రవిశర్మ,పుష్పలత, అఖిల్, కోటిరత్నం, సంపూర్ణ, సాయి ప్రసాద్, కృష్ణ, మోహిత్, సువర్ణ, జానకి తదితరులు పాల్గొన్నారు.
- భావన శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం
Comments
Post a Comment