Posts

Showing posts from July, 2023

ENVIRONMENTAL PROTECTION AWARENESS ACT POSTER LAUNCH

Image
 పర్యావరణ పరిరక్షణలో "నా" పాత్ర అంశంపై ఈరోజు నుండి వ్యాసరచన పోటీలు 1/8/2023 మంగళవారం సమయం 9:30 పొద్దున్న స్థలం  ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం వద్ద కార్యక్రమం స్త్రీ హస్తిన మహిళా మండలి మరియు జాగృతి అభ్యుదయ సంఘం హైదరబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో  పర్యావరణ పరిరక్షణలో "నా" పాత్ర అనే అంశం పై రాష్ట్రస్థాయి ఆన్లైన్ వ్యాసరచన పోటీలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహణ పోస్టర్ ను ఈరోజు ఎల్.బి.నగర్ శాసన సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ మరియు స్త్రీ హస్తిన మహిళా మండలి అధ్యక్షురాలు Dr ఎర్రం పూర్ణశాంతి గుప్త, గుడిపాటి నాగేందర్,  ఇస్మాయిల్ యోగ గురూజీ, శ్రీరంగనాధ్,అఖిల్  తదితరులు పాల్గొన్నారు.

HARITHA HARAM

Image
 తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో,సరిత విద్యానికేతన్ వారు నిర్వహించిన,"వనం-మనం"కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, పంపిణీ అలాగే మొక్కల ఆవశ్యకతను తెలియజేస్తూ పిల్లలతో ర్యాలీ నిర్వహించడమైనది.జాగృతి ప్రతినిధులు  భావన శ్రీనివాస్,శ్రీ రంగనాథ్ గారులు,పాఠశాల యాజమాన్యం "సబిత,నవనీత ,క్రిస్టల్,అనిల్ కుమార్ ,సుధా రాణి ,మొహమ్మదీ బేగం,అల్టాఫ్ హుస్సేన్ ", ఉపాధ్యాయుల బృందం,విద్యార్థులు ,అందరూ పాల్గొనడం జరిగింది.

VEGETABLE PLANTAION

Image
 వానాకాలంలో ముచ్చెమటలు పట్టిస్తున్న టమాటా ఇంకొకరిని నిందించే కంటే.... నేడు టమాటా ధర పెరుగుతూ ఉంది డేటా ధర తగ్గుతూ ఉంది. మనిషికి నిత్యం అవసరమైన కూరగాయల ధరలు ఆకాశాన్ని మించి పోతున్నాయి, కావొచ్చు. పెరిగిన ధరలు తగ్గుముఖం  పట్టాలంటే ఫలితం లేని ఆందోళనలు, గందరగోళాలు, గగ్గోలు పెట్టే కంటే మనమే ఒక అడుగు ముందుకేసి పరిష్కారం కోసం "వావ్" అనిపించే ఈ చిన్న ప్రయత్నం అద్భుతమైన సత్ఫలితాలని ఖచ్చితంగా ఇస్తుంది. నేటి హడావుడి యాంత్రిక జీవితంలో 24 గంటల సమయం చాలక కొన్ని పనులు స్వయంగా చేసుకోలేకపోవడం సర్వసాధారణమౌతుంది, కానీ తప్పనిసరి అనుకున్న పనులకు సమయం కేటాయిస్తూ ఒకే సమయంలో రెండు మూడు పనులు ఎలా చెయ్యొచ్చు అనే దాని గురించే అందరి ఆలోచన. దానిలో భాగమే ఈ వావ్, వారేవా, శెభాష్ అనిపించే ఐడియా. రోజులో ఒక గంట సమయం కేటాయిస్తే చాలు,  *డబ్బు ఆదాతో పాటు ధరలు పెరుగుదల గురించిన ఆందోళన అవసరం లేదు *శరీరానికి శ్రమ(వ్యాయామం) ఫలితంగా ఆరోగ్యం *అనారోగ్య కారక కృత్రిమ ఎరువుల నుండి విముక్తి *ఇంటిల్లిపాది తృప్తితో కూడిన కడుపాకలి తీర్చుకోగలగడం *కూరగాయల కొనుగోలు కోసం ఇంటినుండి బయటికి సుదూరం వెళ్ళే భారం లేదు ఇవన్నీ ఎలా సాధ్య...

WELCOMING GHMC SARKAR 3

Image
                            GHMC హయత్ నగర్ సర్కిల్ 3 నూతన ఉప కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పుప్పాల రవికుమార్ స్వాగతం పలికిన జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు💐 GHMC హయత్ నగర్ సర్కిల్ 3 కు నిన్నటి వరకు ఉపకమీషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ ఎ.మారుతి దివాకర్ గారు అంబర్ పేట సర్కిల్ కు బదిలీ కాగా వారి స్ధానంలో కూకట్ పల్లి నుండి బదిలీ అయిన శ్రీ పుప్పాల రవికుమార్ సర్కిల్ 3 కు DC గా నియమితులైనారు. ఈరోజు వారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు భావన శ్రీనివాస్,గోపాల్ దాస్ రాము,ఇస్మాయిల్ గురూజీలు కలిసి వారిని ఘనంగా స్వాగతించడం జరిగినది. ఈ సందర్భంగా నూతన కమీషనర్ రవికుమార్ జాగృతి బృందంతో ముచ్చటిస్తూ హయత్ నగర్ సర్కిల్ లోని 4డివిజన్ల ప్రజలకు  ఎటువంటి సామాజిక సమస్యలు తలెత్తినా, అవసరాలు ఏర్పడినా నేరుగా తన చరవాణి సంఖ్య: 9989930195 కు ఒక మెసేజ్ ద్వారా తెలియచేయాలన్నారు. దాదాపు మూడున్నర సంవత్సరాలుగా తనకు అన్ని విధాలుగా సహకరించిన సర్కిల్ ప్రజలకు, కాలనీ సంక్షేమ సంఘాల, స్వచ్ఛంద సంస్థల, వివ...

MEDICAL CAMP AND ALMS GIVING

Image
                                                                           పలు సేవా కార్యక్రమాల్లో ప్రముఖులతో కలిసి అతిథిగా భావన శ్రీనివాస్ ఈరోజు ఉదయం బి.ఎన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ లో సంఘసేవకులు శ్రీ గద్దె విజయ్ నేత గారు భవన నిర్మాణ కార్మికుల సంఘంతో కలిసి ఏర్పాటు చేసిన Medical Campనకు ముఖ్య అతిథిగా మరియు  శ్రీ సాయిశాంతి సేవా సమితి అధ్యక్షులు డా.ఎర్రం పూర్ణశాంతి గారి ఆధ్వర్యంలో హస్తినాపురం ఈస్ట్ పోచమ్మ ఆలయం వద్ద జరిగిన అన్నదానం కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు... IPS శ్రీ ఉమేష్ గోయల్, IPS శ్రీ రాజ్ కుమార్ మీనా, CI శ్రీ డి.జలంధర్ రెడ్డి, SI శ్రీ జగన్, SI శ్రీ మాధవరెడ్డి గార్లతో కలిసి అతిథిగా జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించడం జరిగింది🙏

HARITHA HARAM IN SCHOOL

Image
                                    భావితరాల భవితవ్యానికై ఇంకొంత పచ్చదనాన్ని పెంచుదాం ఈరోజు కర్మన్ ఘాట్  Discovery oaks international school లో జరిగిన "Grow More Green" కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ మరియు లక్ష్మీశర్మ గారు పాల్గొని పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. బంగారు భవిష్యత్ కై చిన్నతనం నుండే పర్యావరణ అనుకూల జీవన శైలిని అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరి పుట్టినరోజున ఒక మొక్క నాటి ప్రతి సంవత్సరం తనతో పాటు ఆ మొక్కకి కూడా పుట్టిన రోజు జరపాలని అలా తనతోపాటు పెంచిన మొక్క పెద్ద చెట్టుగా మారి మనిషితో పాటు జీవరాశికి అవసరమైన ప్రాణవాయువుని, ఆహారాన్ని, నీడను, మందులను, ఆశ్రయాన్ని,కలప, వంటచెరకును, వర్షాలను ఇస్తుందని,అంతేకాకుండా కాలుష్య నియంత్రణ జరిగి అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతుందని అన్నారు. కార్యక్రమం చివర్లో విద్యార్ధులకు వివిధ రకాల 150 పూలు, ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడమైనది., స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి నిర్మల మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక...

FRUIT PLANT PLANTATION

Image
మొక్కకు పోద్దాం నీరు-దూరం చేద్దాం మన కన్నీరు జాగృతి అభ్యుదయ సంఘం "వనం-మనం" పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులతో ప్రమాణం చేయించిన ముఖ్య అతిథులు వనస్థలిపురం CI శ్రీ దేప జలంధర్ రెడ్డి, GHMC హయత్ నగర్ సర్కిల్ 3 ఉప కమీషనర్ శ్రీ ఎ.మారుతి దివాకర్ లు      జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ సభాద్యక్షతన ఈరోజు  బి.ఎన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు "పర్యావరణం-మానవనైజం" అవగాహనా చైతన్య కార్యక్రమం నిర్వహించడమైనది, అనంతరం కాలనీ వీధుల్లో పెద్ద ఎత్తున పెద్ద సైజ్ పండ్ల మొక్కలు నాటి సంరక్షణా గార్డులు ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా CI జలంధర్ రెడ్డి మాట్లాడుతూ... పర్యావరణాన్ని/ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కోట్ల రూపాయల ఆస్తి అని, ఆక్సిజన్ ని కృత్రిమంగా కొనుక్కోవాల్సిన అవసరం రాకూడదని, మొక్కలను విరివిగా పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ చేపట్టాలని...  *నేను .... భూమాత బిడ్డను,  మట్టి నాకు శరీరాన్ని ఇచ్చింది, నీరు నాకు రక్తాన్ని ఇచ్చింది, గాలి నాకు శ్వాసను ఇచ్చింది, అగ్ని నాకు ఆయువును ఇచ్చింది, ఆకాశం నాకు ఆలోచనను ఇచ...