జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో GHMC C3 సాహెబ్ నగర్ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు రగ్గుల పంపిణీ...
*సఫాయన్నా సలామన్నా*🫡 👉 *జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో GHMC C3 సాహెబ్ నగర్ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు రగ్గుల పంపిణీ*... 👉 *చలిలో రోడ్ల మీద విధులు నిర్వహించే కార్మికులకు రగ్గులు ఇవ్వడం అభినందనీయం... వనస్ధలిపురం CI మహేష్ గౌడ్* తెల్లవారుఝామున ఎముకలు కొరికే చలిలో కూడా రోడ్లు ఊడ్చి ప్రజలకు పరిశుభ్రతతో కూడిన వాతావరణాన్ని అందించే జి.హెచ్.యం.సి పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన జాగృతి అభ్యుదయ సంఘం, విమల్ బన్సాల్ గారి ఆర్ధిక సహాయంతో గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ "మొదటి ముద్ద" వేదికగా ఈరోజు 40మంది పారిశుద్ధ్య కార్మికులకు రగ్గులను ఉచితంగా పంపిణీ చేసింది. పంపిణీకి ముఖ్య అతిథిగా వనస్ధలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్ గౌడ్, విశిష్ట అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ లు విచ్చేశారు. ఈ సందర్భంగా CI మహేష్ గౌడ్ మాట్లాడుతూ చలికి తట్టుకోలేమనుకుంటూ విధులకు డుమ్మా కొట్టకుండా పారిశుద్ధ్య కార్మికులు వారి సొంత ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన పరిసరాలను అందించేందుకు అహ...