*జాగృతి అభ్యుదయ సంఘం సేవలను అభినందించిన RSS జాతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్*
*జాగృతి అభ్యుదయ సంఘం సేవలను అభినందించిన RSS జాతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్*
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్ గారి హైదరాబాద్ సందర్శన సందర్భంగా ఈ రోజు మొదటిముద్ద మిల్లెట్ తినుబండారాల తయారీ యూనిట్ లో జరిగిన సమావేశంలో జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ గారు పర్యావరణానికి చేస్తున్న నిస్వార్ధ సేవలను, విలువలతో కూడిన వ్యాపారాన్ని రాకేష్ జైన్ కొనియాడారు. శ్రీనివాస్ తమ సంస్థలో, ఇంట్లో తాను పాటిస్తూన్నదే సమాజ హితంకోరి బయటికి ప్రచారం చేస్తున్నారని అన్నారు.
నీటిని, మట్టిని, ప్రతి చెట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రకృతిని విపరీతంగా ధ్వంసం చేయటంతోనే ఉత్తరాఖండ్ మరియు కేరళలో ఎన్నడూ చూడని విపత్తులు సంభవించాయని పర్యావరణాన్ని రక్షించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాకేష్ జైన్ గుర్తుచేశారు.
ప్లాస్టిక్ వ్యర్దాలవల్ల భూమాత కకాలవికాలమవుతుందని నగరాల్లో చెత్తవేసే ప్రాతం కొండల్లా పేరుకుపోతున్నాయని దీనికి కారణం చెత్తసేకరణలో ప్లాస్టిక్ కలిసిపోవడం వల్లనేనని ఉద్గాటించారు.
ప్లాస్టిక్ కవర్లను పారవేయకుండా ప్లాస్టిక్ సీసాల్లో నింపటం వల్ల దాన్ని కొంత తగ్గించవచ్చని, ప్లాస్టిక్ ని భూమిపై వేయనని ప్రతిఒక్కరు ప్రతిన చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని, దానిద్వారా ప్రకృతిలోని ప్రతి ప్రాణికి మేలుజరుగుతుందని అన్నారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్లయితే ప్రకృతి వనరులను ఆదా చేసుకోవచ్చని అన్నారు.
జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు రాకేష్ జైన్ గారిని మరియు వచ్చిన సభ్యులను చేనేత శాలువాలతో, బట్టసంచులతో సన్మానించడం జరిగింది.
కార్యక్రమంలో RSS ప్రతినిధులు యం దత్తాత్రేయ, భాస్కర్, పర్యావరణ, సామాజిక కార్యకర్త గోపాల్ దాస్ రాము, చిత్తలూరి వేణు, యాదా రామలింగేశ్వర్రావు, పద్మజ, డాక్టర్ విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, నర్సింహులు, కోటేశ్వరరావు, రామకృష్ణ, శివరాం, భరత్, రమేష్, రామచంద్ర రావు, రాజేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.








Comments
Post a Comment