*భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసిలకు పూజలు*
*భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసిలకు పూజలు*
👉NGO కాలనీ గణేష్ దేవాలయంలో షుమారు 200 మంది మహిళల సామూహిక కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి పూజలు...
👉పూజల కొరకు తులసి, ఉసిరి మొక్కలు ఉచితంగా ఇస్తూ వాటి విశిష్టతను వివరించిన జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్.
పూజారి సోమయాజులు గారి ఆధ్వర్యంలో వనస్ధలిపురం NGO కాలని గణేష్ దేవాలయంలో ఈ ఉదయం 200 మంది మహిళలు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసి మొక్కలకు పూజలు చేశారు.
మహిళలను ఉద్దేశించి వక్తలు... BN Reddy Division గాయత్రి నగర్ ఫేజ్ 4 అద్యక్షులు శ్రీ మనోజ్ కుమార్ గౌరి శెట్టి ప్రసంగిస్తూ... పూజలనంతరం ఆ మొక్కలు నాటి పెంచితేనే పూజల ఫలితం ఆరోగ్యం రూపంలో లభిస్తుందని, "ఉసిరి చెట్టు క్రింద కూర్చుని వన భోజనం" చేయడం అనే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు భావన శ్రీనివాస్ గారి స్పూర్తితో తమ కాలనీలో 200 మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని అన్నారు.
సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, ప్రముఖ వాస్తు నిపుణులు, సంస్కార భారతి అద్యక్షులు ఐన విశ్రాంత ఇంజనీర్ శ్రీ పెంటపాటి కృష్ణాదిశేషు మాట్లాడుతూ... మనిషితో పాటు ప్రతి జీవి మనుగడకు చెట్లే ప్రధానమని, అటువంటి చెట్లను ఇంటి ప్రాంగణంలో వాస్తు ప్రకారం నాటుకోవడం వలన కుటుంబంలో శుభాలు జరుగుతాయని అన్నారు.షుమారు పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తమ దేవాలయానికి ఈ మొక్కలను ఉచితంగా ఇస్తున్న భావన శ్రీనివాస్ సేవలను సోమయాజులు కొనియాడారు.
కార్యక్రమంలో సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ రవికాంత్ గారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ బ్యాగ్ లను ప్రదర్శించి అందుబాటులో ఉంచారు.
కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి శ్రీ సత్యనారాయణ, గోపాల్ దాస్ రాము, గుద్దేటి నర్సింహులు, బుగ్గయ్య, మహిళలు పాల్గొన్నారు.



Comments
Post a Comment