ఈనాడు* దినపత్రిక మరియు జాగృతి అభ్యుదయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆచరణాత్మక శైలిలో నిర్వహించబడిన మిద్దె తోటల అవగాహన సదస్సు
ఈనాడు* దినపత్రిక మరియు జాగృతి అభ్యుదయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో
ఆచరణాత్మక శైలిలో నిర్వహించబడిన మిద్దె తోటల అవగాహన సదస్సు
.jpeg)
కొద్దిపాటి శారీరక శ్రమ, రోజులో కొంత సమయం, అతి కొద్ది పెట్టుబడితో డాబా పైన ఎన్నో లాభాలనిచ్చే కూరగాయల మిద్దె తోటలు పెంచుకోడంపై అవగాహన కార్యక్రమం... డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం మొదటి ముద్ద చిరుధాన్యాల శాకాహార ఫలహారశాల వద్ద ఉదయం 10 గంటలనుండి జరిగింది
ఈ సందర్భంగా భావన శ్రీనివాస్, చైర్మన్,జాగృతి అభ్యుదయ సంఘం గారు మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడొద్దని అన్నారు. మిద్దె పంటపై గత 15 ఏళ్లగా అవగాహన కల్పిస్తున్నాం. మిద్దె తోటల పెంపకం చేపడితే ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా యోగా చేయాల్సిన అవసరం లేదు. ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. మట్టి కుండలు సిమెంట్ రింగులు పాడైపోయిన కూలర్ బేస్ లు డ్రమ్ములను సిమెంట్ తొట్టిలను వాడుకోవాలి. అని ఆయన అన్నారు
ఆరోగ్యం కొరకు మిద్దె తోటల పెంపకంపై ఆసక్తి కలవారు ఆచరణాత్మక చిట్కాల కొరకు "ఈనాడు" ఉచితంగా నిర్వహించిన ఈ శిక్షణకు ఎంతో ఆసక్తిగా హాజరయ్యారు


.jpeg)



Comments
Post a Comment