జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో GHMC C3 సాహెబ్ నగర్ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు రగ్గుల పంపిణీ...
*సఫాయన్నా సలామన్నా*🫡
👉 *జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో GHMC C3 సాహెబ్ నగర్ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు రగ్గుల పంపిణీ*...
👉 *చలిలో రోడ్ల మీద విధులు నిర్వహించే కార్మికులకు రగ్గులు ఇవ్వడం అభినందనీయం... వనస్ధలిపురం CI మహేష్ గౌడ్*
తెల్లవారుఝామున ఎముకలు కొరికే చలిలో కూడా రోడ్లు ఊడ్చి ప్రజలకు పరిశుభ్రతతో కూడిన వాతావరణాన్ని అందించే జి.హెచ్.యం.సి పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన జాగృతి అభ్యుదయ సంఘం, విమల్ బన్సాల్ గారి ఆర్ధిక సహాయంతో గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ "మొదటి ముద్ద" వేదికగా ఈరోజు 40మంది పారిశుద్ధ్య కార్మికులకు రగ్గులను ఉచితంగా పంపిణీ చేసింది.
పంపిణీకి ముఖ్య అతిథిగా వనస్ధలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్ గౌడ్, విశిష్ట అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ లు విచ్చేశారు.
ఈ సందర్భంగా CI మహేష్ గౌడ్ మాట్లాడుతూ చలికి తట్టుకోలేమనుకుంటూ విధులకు డుమ్మా కొట్టకుండా పారిశుద్ధ్య కార్మికులు వారి సొంత ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన పరిసరాలను అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారని, అటువంటి వారి శ్రమను గుర్తించి వారికి చేదోడుగా ఉండాలనే తలంపుతో జాగృతి అభ్యుదయ సంఘం రగ్గులు పంచడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఎంత సంపాదించినా రాని సంతృప్తి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పొందవచ్చని అన్నారు.
కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన షుమారు 15 శివారు కాలనీల ప్రతినిధులు జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను, Right Vote Challenge ఉద్యమాలను కొనియాడారు. జాగృతి నిస్వార్ధంగా చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు తమవంతు తోడు నిలుస్తామన్నారు.
వరుసగా 3 సంవత్సరాలుగా తమకు రగ్గులు పంచుతున్న భావన శ్రీనివాస్ కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో గోపాల్ దాస్ రాము, గాయత్రి నగర్ ఫేజ్ 4, ఫేజ్ 2, భవాని ఎంక్లేవ్, సౌభాగ్య నగర్ కాలనీ, జక్కిడి రాంరెడ్డి కాలని, శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీ, పాపిరెడ్డి కాలనీల సంక్షేమ సంఘాల అద్యక్షులు.... మనోజ్ గౌరి శెట్టి, చందు నాయక్, ప్రశాంత్ గౌడ్, డాక్టర్ రాము, నాగేంద్ర, పాటి రాంబాబు గౌడ్, సోమయ్య గౌడ్, జక్కిడి నగర్ తో పాటు పలు కాలనీల మాజీ అద్యక్షులు, ప్రతినిధులు... నంద కిషోర్, శ్రీమతి భవాని, దయాకర్ ముదిరాజ్, డాక్టర్ విజయ్ కుమార్, జి. శేఖర్, యాదిరెడ్డి, రాజు గౌడ్, జైపాల్ నాయక్, శ్రీనివాస్, లక్ష్మయ్య, రమేష్, జాగృతి ప్రతినిధులు శ్రీరాములు గౌడ్, ఓబులేష్ యాదవ్, కుమారస్వామి, వీరచంద్రరావు, రవీందర్, రాఘవేంద్రరావులతో పాటు GHMC శానిటేషన్ జవాన్ యాదగిరి, గోవర్ధన్ రెడ్డి, ప్రకాష్, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు...
భావన శ్రీనివాస్,
ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం.
Comments
Post a Comment