జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల కాలుష్యం - నియంత్రణ ఆవశ్యకతపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల నిర్వహించిన పోటీల్లో నాటికల విభాగంలో వనస్ధలిపురం జాగృతి అభ్యుదయ సంఘం గ్రీన్ సోల్జర్స్ ప్రదర్శించిన "గంగా" నాటికకు ప్రధమ, తృతీయ బహుమతులు గెలుచుకుంది.
ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయం సనత్ నగర్ లో నిర్వహించిన బహుమతుల పంపిణీ కార్యక్రమానికి EFS&T Minister శ్రీమతి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అహమద్ నదీమ్ IAS, TGPCB సభ్య కార్యదర్శి రవి కుమార్ IAS, సోషల్ సైంటిస్ట్ W.G ప్రసన్నకుమార్ తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా...
జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ సంతోషం వ్యక్త పరుస్తూ పర్యావరణ పరిరక్షణకై తమ మీద మరింత బాధ్యతలు పెరిగాయని భావిస్తున్నట్లుగా అన్నారు.
Comments
Post a Comment