ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
👉1) హయత్ నగర్ కోర్ట్ లో...
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ హయత్ నగర్ 14వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో వివిధ యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామ ప్రక్రియలు నేర్పించడమైనది.
ఈ సందర్భంగా కోర్టు ఇంచార్జి జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి గోపిక నాగ శ్రావ్య మాట్లాడుతూ ప్రతిరోజూ ఒక్క గంట శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని, రోగాలు పాలు కాకుండా సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చని, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడులను జయించవచ్చని అన్నారు.
కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గోపాల్ దాస్ రాము, కోర్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ధారా రాములు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు... మోడెమ్ ప్రభాకర్, బండి నరేష్, మేకల సతీష్, న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
👉2) సచివాలయ నగర్ కమ్యూనిటీ హాల్ నందు...
Dept.of AYUSH వనస్ధలిపురం హోమియో వైద్యశాల, జాగృతి అభ్యుదయ సంఘం, సచివాలయ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా వేడుకలకు వనస్ధలిపురం ACP శ్రీ పల్లె కాశిరెడ్డి, బి.ఎన్. రెడ్డి డివిజన్ కార్పోరేటర్ శ్రీ మొద్దు లచ్చి రెడ్డి అతిధులుగా హాజరు కాగా సచివాలయ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు పింగళి సాంబశివరావు సభాద్యక్షత వహించారు. యోగా మాస్టర్ రాకేష్ యోగాసనాలు చేయించిన అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ప్రభుత్వ హోమియో వైద్యులు డా|| రాధ, ఫార్మాశిస్ట్ రమేష్, జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్, సచివాలయ నగర్ కాలని పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి, కుర్మా రావు, బసవయ్య, బాల్ రెడ్డి, ఆలేటి రవి, గోపాల్ రెడ్డి, కమిటి సభ్యులు, గోపాల్ దాస్ రాము, మధర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ అద్యక్షులు చేపూరి శంకర్, శాంతినికేతన్ పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు.
యోగా డే సందర్భంగా వనస్ధలిపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిధుల చేతులు మీదుగా డాక్టర్ రాధ బహుమతులు అందించారు.
Comments
Post a Comment