పర్యావరణ హితంగా శ్రీ సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ
జాగృతి అభ్యుదయ సంఘం, వాసవి క్లబ్ మరియు వాసవి వనిత సంయుక్త ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ తేదీ 04/04/2026 శనివారం ఉదయం 9:00 గo. లకు జరిగినది. కార్యక్రమంలో అల్పాహారం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మరియు టీ స్టీల్ గ్లాసులలలో ఇవ్వడం జరిగింది. పూలు, పూజా సామాగ్రి మొత్తం ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులలో కాకుండా తిరిగి వాడుకునే సంచులలోనే క్యారీ చేయడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, దాతలకు చేనేత కండువాలను శాలువాగా కప్పి తిరిగి వాడుకునే బ్యాంబూ, స్టీల్, మట్టి వాటర్ బాటిల్స్, బట్ట సంచులను, నాచురల్ రూమ్ ఫ్రెషనర్ లను, విద్యార్థులకు పండ్లను ఇవ్వడమైనది. కార్యక్రమం అంతా పర్యావరణహితంగా జరిగినది.