జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మౌన ప్రదర్శన

 *జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మౌన ప్రదర్శన*

👉 వాడవాడలా ఈ ప్రదర్శనలు జరగాలి.

ప్రజల కోరికగా ప్రజా ప్రతినిధుల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఈ సంకేతాలు అందాలి... భావన శ్రీనివాస్.

     మూడవ ప్రపంచ యుధ్ధ పరిణామాల నేపధ్యంలో ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధం వలన ఎదురయ్యే దుష్పరిణామాలు ప్రపంచ వినాశనానికి, దరిద్రానికి, కరువు కాటకాలకు దారి తీస్తాయని "యుద్ధం వద్దు ! శాంతి ముద్దు" అని పిలుపునిస్తూ జాగృతి అభ్యుదయ సంఘం  ఆధ్వర్యంలో ఇంజాపూర్ - సాహెబ్ నగర్ డివిజన్ ప్రధాన రహదారుల్లో ఈరోజు మౌన ప్రదర్శన నిర్వహించారు.

ప్రదర్శన అనంతరం...




ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక విశ్లేషకులు కె.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ...

 ప్రస్తుత సమాజంలో ప్రజలు తమ తమ నిత్య జీవితంలో పౌర సౌకర్యాల కోసం సుస్థిర జీవనం గడపడం కోసం అనేకానేక పోరాటాలు చేసే ఈ సమయంలో మరో మూడో ప్రపంచ యుద్ద పరిస్థితి నెలకొంది. ఇటువంటి స్ధితిని అమెరికా దాని మిత్ర పక్షం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, మరోపక్క ఉక్రెయిన్ - రష్యాల మధ్య సుదీర్ఘ కాలంగా నడుస్తున్న యుద్ధం వల్ల కేవలం ఆ దేశాలే కాకుండా ప్రపంచంలోని ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా అభివృద్ధి అవుతున్న మన భారతదేశం లాంటి చిన్న చిన్న దేశాల ఉనికికే ప్రమాదం జరుగుతోంది. జన క్షయమే కాకుండా ప్రకృతి ద్వారా లభించే సహజ వనరుల వినాశనం అవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జాగృతి అభ్యుదయ సేవాసంస్థ ఈ యుధ్ధాలను ఆపడానికి మొట్ట మొదటగా మౌన ప్రదర్శన ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. 

యుధ్ధం వద్దు శాంతియే ముద్దు అని అణ్వాయుధాలు వద్దు ఆకలి తీర్చే సాధనాలే ముద్దు అనే నినాదాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. యుద్ధం జరుగుతున్న ఈ కాలంలోనైనా పెట్రోలియం ఉత్పత్తులను పరిమితంగా వాడదాం అని వంట గ్యాస్ భారాన్ని నియంత్రణ చేసేలా కాఫీ టీ లాంటి వాటిని, జంక్ ఫుడ్  లేని బహిష్కరణ చేయాలని శీతల పానీయాలు, పండ్లు వాటి రసాలు చెరుకు రసం వినియోగించాలని హాజరైన సభ్యులు తెలిపారు.


 డాక్టర్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ...

యుద్ధం అనేది నాశనం మరియు బాధను మాత్రమే తీసుకువస్తుంది. ప్రాణ నష్టం, కుటుంబాల విచ్ఛిన్నం, సమాజంలో భయం – ఇవే యుద్ధం ఫలితాలు. నా అభిప్రాయం ప్రకారం, సమస్యలను సంభాషణ ద్వారా పరిష్కరించుకోవాలి, యుద్ధం ద్వారా కాదు.

శాంతి, సహనం, ఐక్యతే మనకు అవసరం.

*యుద్ధం కాదు, శాంతే గొప్పది.* అన్నారు.




 మరొక సామాజిక శ్రేయోభిలాషి గోపాల్ దాస్ రాము అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలనుద్దేశించి మాట్లాడుతూ...

మీ అహంకార ఆధిపత్య పోరాటాలకు మేమెందుకు మూల్యం చెల్లించుకోవాలి, యుద్ధం వలన మిగిలేది బూడిదేనని,తక్షణం యుద్ధం ఆపాలని, ఈ విషయమై మౌనం వీడి ప్రపంచ దేశాలు శాంతి కోసం తక్షణం చొరవ చూపాలని కోరారు.

[3/23, 13:09] bhavana srinivas: జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం మా ఈ మౌన ప్రదర్శన ఉద్దేశాలను మన ప్రజల తరపున స్ధానిక ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేయాలని, శాంతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రాయబారాలు మొదలు పెట్టాలని అన్నారు.


మౌన ప్రదర్శనా కార్యక్రమంలో  నాగరాజు, కె గురు, రాజు యాదవ్, పాటి రాంబాబు గౌడ్, ఉద్భవ్, చి. అపూర్వ, శివ, రేణుక, రామకృష్ణ, రాజు గౌడ్ సీతారామయ్య, బి.శ్రీనివాస్, విష్ణు, జైపాల్ నాయక్, ఫణి కుమార్, ఒ వి ఆర్ కుమార్, రాజయ్య, లక్ష్మయ్య, రమేష్, రత్న శేఖర్, లోకేష్, వాసన్ రెడ్డి, శివాచారి, చందు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు....

-

భావన శ్రీనివాస్ 

ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం.

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025