ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత చుక్క చుక్క నీరు కలిస్తేనే సముద్రం --- వనస్థలిపురం నూతన సీఐ రవిబాబు
*ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత:*
👉*చుక్క చుక్క నీరు కలిస్తేనే సముద్రం* ....*వనస్థలిపురం నూతన సీఐ
మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవంను పురస్కరించుకుని జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఛైర్మన్ భావన శ్రీనివాస్ సభాద్యక్షతన ఈరోజు శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీ గణేష్ మండపం వేదికగా నిర్వహించిన కృత్రిమ పిచ్చుకల గూళ్లు, విత్తనాలు మరియు నీటి మూకుడులు, వస్త్ర సంచులు, తులసి మొక్కల ఉచిత పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం పలువురకు స్ఫూర్తిదాయకమని వనస్థలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిబాబు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ రవి నాయక్ గారితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
*ప్రసంగంలోని ముఖ్యాంశాలు:*
*పర్యావరణ స్పృహ:* ప్రకృతిని కాపాడుకోవడంలో భావన శ్రీనివాస్ గారి కృషి అభినందనీయం. వేసవిలో పక్షులకు గూళ్లు, మట్టి పాత్రలలో నీటిని ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.
మట్టిని గుల్లగా చేసి నేలను సారవంతంచేయడంలో వానపాములది ప్రధాన పాత్ర అని కృత్రిమ ఎరువులు, పురుగుమందులు వాడటం వలన అవి చనిపోవడంతో పాటు మట్టి శాశ్వతంగా జీవం కోల్పోయే ప్రమాదంలో పడుతున్నామని సి ఐ అన్నారు. అలాగే భూమిపై ప్రతి జీవి పుట్టుకలో ఏదో పరమార్థం ఉంటుందని, కీటకాలనుండి పంటలు రక్షించటంలో పిచ్చుకలు తమ పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటూ చేసే పారిశ్రామిక అభివృద్ధి అన్ని విధాలా శ్రేయస్కరం అన్నారు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని వీడి పర్యావరణహిత మరియు తిరిగి వాడుకునే వస్తువులను ప్రోత్సహించాలన్నారు.
మనిషి మనుగడ జీవ వైవిధ్యంతో ముడిపడి ఉందని, పక్షులను కాపాడుకోవాల్సిన అవసరం మనిషికి ఉందని అన్నారు.
*భద్రతపై సూచనలు:* కాలనీలలో దొంగతనాల నివారణకు సి.సి. కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరం, ప్రతి CC కెమేరా ప్రతి క్షణం మనల్ని కాపాడే ఒక సెక్యూరిటీ గార్డ్ అని, విపరీతంగా ధర పెరిగిన బంగారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
పౌర విధులు తెలుసుకోకుండా, సామాజిక బాధ్యత తీసుకోకుండా ఆపద సమయంలో నన్ను రక్షించాలనడం ఎంతవరకు సమంజసం అన్నారు.
*స్థానిక పరిష్కారాలు:* చిన్న చిన్న సమస్యలను సాగదీయకుండా స్థానికంగానే పరిష్కరించుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించడానికి వెనుకాడకూడదు అని సిఐ అన్నారు.
*సైబర్ నేరాల పట్ల అప్రమత్తత:* సైబర్ నేరాలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయని, మోసపోయిన తర్వాత డబ్బు రికవరీ చేయడం కష్టమని ముందు జాగ్రతతో ఉండటం ద్వారా వాటినుండి తప్పించుకోవచ్చు అని సీఐ హెచ్చరించారు.
*1930 హెల్ప్‌లైన్:* ఎస్ఐ రవి నాయక్ గారు మాట్లాడుతూ.. సైబర్ మోసానికి గురైన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చేలోపే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది కేవలం ఒక నిబంధన మాత్రమే కాదని, మీ మరియు మీ మీద ఆధారపడిన మీ కుటుంబ భద్రతకు శ్రీరామరక్ష అని ఎస్ఐ రవి నాయక్ గారు పేర్కొన్నారు.
ప్రతి వాహనానికి సరైన ఇన్సూరెన్స్ ఉండాలని, ప్రమాదాలు జరిగినప్పుడు అది ఆర్థికంగా అండగా ఉంటుందని ఆయన వివరించారు.
శ్రీ వెంకటేశ్వర కాలని వీకర్ సెక్షన్ సంక్షేమ సంఘం వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పాటి రాంబాబు గౌడ్, GS లక్ష్మణాచారి, పెద్దలు KLN రావు, పి.వి.ఆర్ కాలని, గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ, భవాని ఎంక్లేవ్, శ్రీ గాయత్రి నగర్, జక్కిడి నగర్, సత్య సాగర్ కాలని, శాతవాహన నగర్, గాయత్రి నగర్ కాలనీల ప్రతినిధులు గోపాల్ దాస్ రాము, రేణుక, ప్రశాంత్ గౌడ్, సూర్యానాయక్, రాజీవ్, ఒవిఆర్ కుమార్, రవి కుమార్, డాక్టర్ విజయ్ కుమార్, వనస్ధలి పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడు మెండెం లక్ష్మణ్, జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వరరావు, అఖిల్, ప్రశాంత్, వెంకటేశ్వర కాలనీ కమిటి సభ్యులు, పర్యావరణ ప్రేమికులు, మహిళలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...
-
భావన శ్రీనివాస్
ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం.
Comments
Post a Comment