31-01-2024 గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీని సందర్శించిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీని సందర్శించిన బి.ఎన్.రెడ్డి కార్పోరేటర్ శ్రీ మొద్దు లచ్చిరెడ్డి
గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ ఫేజ్ 1,2,3 వాసుల ఆహ్వానం మేరకు ఈరోజు బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ శ్రీ మొద్దు లచ్చిరెడ్డి క్రిస్టల్ విల్లాస్ ఉత్తర వైపునున్న 3కాలనీల కామన్ స్ట్రీట్ ఐన రోడ్ నంబర్ 6కు విచ్చేశారు.
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా విల్లాస్ వాళ్ళు డ్రైనేజ్ 3కాలనీల వాసుల రాకపోకలకు అంతరాయం కలిగే విధంగా దుర్గంధం వెదజల్లే మలమూత్రాలు కలిసిన మురికి నీటిని రోడ్ నెంబర్ 6లోకి వదులుతున్నారని, గతరాత్రి సమయంలో కూడా ఆ గబ్బు నీటిని కామన్ వరద కాలువ లోనికి వదలడం జరిగిందని, ప్రతి రోజూ ప్రతి 2గంటలకు ఒకసారి వాళ్ళ డ్రైనేజ్ నీళ్ళు ఈ రోడ్ లో ట్యాంకర్ ను దారికి అడ్డంగా నిలిపి వాహనాల రవాణాకు ఆటంకం కల్గిస్తూ నింపికెళ్తున్నారని కార్పోరేటర్ కు విన్నవించినారు.
వెంటనే కార్పోరేటర్ స్పందిస్తూ విల్లాస్ బలరామిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇంకోసారి అలా జరగనివ్వద్దని, 3కాలనీల ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీ ట్యాంకర్ మీ కాంపౌండ్ లోపలనుంచే నింపికెళ్ళమని ఆదేశించారు. వెంటనే కార్పోరేటర్ గారి ఆదేశాలను అనుసరిస్తూ విల్లాస్ డ్రైనేజ్ ట్యాంకర్ ను వాళ్ళ కాంపౌండ్ లోపలికి పంపించుకోవడమైనది, సదరు చిత్రాలను ఫొటోలలో చూడవచ్చు.
అంతేకాకుండా GNBCలో రేపటినుండి మొదలు కాబోతున్న డ్రైనేజ్ పనుల నిమిత్తం పైపుల లెవల్స్ కు అనుగుణంగా HMWSSB డిపార్ట్మెంట్ వారే అవసరమైన మట్టిని తోలుకుంటారని, కాలనీవాసులు ఎవరూ డిస్మాంటల్ కాని, గ్రావెల్ కు కాని సొంత డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదని అన్నారు.
సందేహంగా ఉన్న రోడ్ నెంబర్ 8 లో డ్రైనేజ్ లెవెల్స్ విషయమై మరొకసారి అధికారులతో కూలంకషంగా మాట్లాడుతానన్నారు.
కార్యక్రమంలో GNBC 3 కాలనీల వాసులతో పాటు BJP విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్లొనగా కాలనీల ప్రజలు కార్పోరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు
Comments
Post a Comment