01-26-2024 REPUBLIC DAY
ఈరోజు సాయంత్రం జరిగే మన కాలనీ సర్వ సభ్య సమావేశం హుందాగా, సుహృద్భావ వాతావరణంలో జరగాలని కోరుకుందాము.
గత కమిటి వైఫల్యాల గురించి,చేసిన అభివృద్ధి పనులు,జమా ఖర్చుల గురించి వివరణ కోరవచ్చు,చర్చించవచ్చు,విభేదించవచ్చు,అనుకూలించవచ్చు,ప్రశ్నించవచ్చు,
కానీ ఇదంతా ఘర్షణ పూరిత వాతావరణంలో శత్రు భావనతో కాకుండా సోదర భావంతో పరస్పరం చర్చించుకుని ఒకే కాలనీ నివాసులుగా కలిసి మెలిసి శ్రమించి మన కాలనీకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చే విధంగా, ప్రక్క కాలనీలకు స్పూర్తిగా నిలిచే విధంగా, మన పిల్లల ఆరోగ్యం,వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రేపటి మంచి సమాజం కోసం పరితపిస్తూ సాధన చేద్దాము.
రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, స్వాతంత్ర్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ చొరవ చూపి నోరు విప్పి మీ మీ అభిప్రాయాలు నిర్భయంగా,నిస్పక్షపాతంగా పంచుకుని కాలనీ అభివృద్ధికి ప్రత్యక్షంగా,పరోక్షంగా తోడ్పడాలని కోరుకుంటూ...
భవదీయుడు - భావన శ్రీనివాస్, ప్లాట్ నంబర్ 128NP, Rd నంబర్ 5, GNBC.
సామాజిక విశ్లేషకుడు
పర్యావరణ పరిరక్షణకుడు
Comments
Post a Comment