31-01-2024 VANASTHALIPURAM నూతన CI కు జాగృతి ఘన స్వాగతం!!
వనస్ధలిపురం నూతన CI కు జాగృతి ఘన స్వాగతం
వనస్ధలిపురం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా Special Branch నుంచి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన 2009 బ్యాచ్ CI బి.రవికుమార్ కు జాగృతి అభ్యుదయ సంఘంతో పాటు పలు సంఘాల నాయకులు ఈరోజు వారి కార్యాలయంలో కలిసి దుశ్శాలువాతో స్వాగతం పలకడమైనది.
ఈ సందర్భంగా CI మాట్లాడుతూ నేటి సమాజంలో ఇప్పటికీ అతి కొద్ది శాతం మందిలోనే నేర ప్రవృత్తి ఉందని, వారి బలగం, ప్రభావం పెరగకుండా విచ్ఛిన్నం చేస్తూ పైరవీలకు,ఒత్తిళ్ళకు లొంగకుండా నేరగాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అన్ని సమాజహిత, సేవా కార్యక్రమాలకు హాజరౌతూ తనవంతు సహకారం అందిస్తానన్నారు.
CI స్ధానంలో తాత్కాలిక విధులు నిర్వహించిన Detective Inspector వెంకట్ గారిని సభ్యులు సత్కరించారు.
ఈ సందర్భంగా హాజరైన పెద్దలు...సమాజంలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైనదనీ.. పోలీసులు పౌరులతో మిత్రులుగా మెలగవలసి ఉంటుందనీ తెలియజేస్తూ..
కొత్త CI గారి నేతృత్వంలో వనస్థలి పురం నేర రహిత ప్రాంతంగా రూపొంది శాంతి భద్రతలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.
స్వాగత కార్యక్రమంలో
జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ తో పాటు
బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు చింతపల్లి మంగపతిరావు, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు మరియు ప్రముఖ వాస్తు నిపుణులు పెంటపాటి కృష్ణాదిశేషు, వనస్ధలిపురం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పోచంపల్లి శ్రీధర్ రావు, వనస్ధలిపురం భక్త సమాజం అద్యక్షులు మరియు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు Ch.V.R.K.మూర్తి, ప్రముఖ యోగా గురువు ఇస్మాయిల్, శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వరరావు,శ్రీరాములు గౌడ్, ఓబులేష్ యాదవ్, SI జగన్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment