31-01-2024 గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీని సందర్శించిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీని సందర్శించిన బి.ఎన్.రెడ్డి కార్పోరేటర్ శ్రీ మొద్దు లచ్చిరెడ్డి గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ ఫేజ్ 1,2,3 వాసుల ఆహ్వానం మేరకు ఈరోజు బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ శ్రీ మొద్దు లచ్చిరెడ్డి క్రిస్టల్ విల్లాస్ ఉత్తర వైపునున్న 3కాలనీల కామన్ స్ట్రీట్ ఐన రోడ్ నంబర్ 6కు విచ్చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా విల్లాస్ వాళ్ళు డ్రైనేజ్ 3కాలనీల వాసుల రాకపోకలకు అంతరాయం కలిగే విధంగా దుర్గంధం వెదజల్లే మలమూత్రాలు కలిసిన మురికి నీటిని రోడ్ నెంబర్ 6లోకి వదులుతున్నారని, గతరాత్రి సమయంలో కూడా ఆ గబ్బు నీటిని కామన్ వరద కాలువ లోనికి వదలడం జరిగిందని, ప్రతి రోజూ ప్రతి 2గంటలకు ఒకసారి వాళ్ళ డ్రైనేజ్ నీళ్ళు ఈ రోడ్ లో ట్యాంకర్ ను దారికి అడ్డంగా నిలిపి వాహనాల రవాణాకు ఆటంకం కల్గిస్తూ నింపికెళ్తున్నారని కార్పోరేటర్ కు విన్నవించినారు. వెంటనే కార్పోరేటర్ స్పందిస్తూ విల్లాస్ బలరామిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇంకోసారి అలా జరగనివ్వద్దని, 3కాలనీల ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీ ట్యాంకర్ మీ కాంపౌండ్ లోపలనుంచే నింపికెళ్ళమని ఆదేశించారు. వెంటనే కార్పోరేటర్ గారి ఆదేశాలను...