🌱జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం🥦
1)👉 ఉత్సాహంగా పాల్గొన్న కొత్తపేట లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు
👉మెగా ర్యాలీ అనంతరం పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమం
👉 విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికేట్ లు ప్రధానం చేసిన GHMC స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి యశశ్రీ...
జాగృతి అభ్యుదయ సంఘం 16సం.ల సుధీర్ఘ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా 08/07/'25 మంగళవారం కొత్తపేట నందలి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ వేదికగా 2025 వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పలు పర్యావరణ పరిరక్షణ నినాదాలతో ప్ల కార్డులను ప్రదర్శిస్తూ కొత్తపేట పురవీధుల్లో మెగా ర్యాలీ నిర్వహించారు.
అనంతరం స్కూల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు స్కూల్ యాజమాన్యం నడుం బిగించింది.
తదనంతరం ఇస్మాయిల్ గురూజీ సభాద్యక్షతన నిర్వహించిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న GHMC స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి యశశ్రీ మాట్లాడుతూ... మనం పీల్చే ప్రాణవాయువు కొరత రాకుండా ఉండాలంటే చెట్లను పెంచడం ఒక్కటే మార్గమని అన్నారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవని అన్నారు, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేసి తిరిగి వాడుకునే వస్తువులను మాత్రమే వినియోగించాలని అన్నారు. ఈ విషయాలను గుర్తించి చిన్న వయసు నుండే విద్యార్ధులను పర్యావరణ అనుకూల జీవన శైలి వైపు అడుగులు వేయిస్తున్న లోటస్ ల్యాప్ స్కూల్ యాజమాన్యం మరియు జాగృతి అభ్యుదయ సంఘం సేవలను ఆమె కొనియాడారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగస్వాములు ఐన స్కూల్ విద్యార్థులకు జాగృతి రూపొందించిన సర్టిఫికెట్ లు ప్రధానం చేశారు.
కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భావన శ్రీనివాస్, గోపాల్ దాస్ రాము, జీవనది ఫౌండేషన్ లక్ష్మీదుర్గ, లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి స్వప్న, అనిత, శోభన్ బాబు, స్వచ్ఛ భారత్ టీం మెంబర్ జయశ్రీ, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
2) 👉09/07/'25 బుధవారం కర్మన్ ఘాట్ లోటస్ ల్యాప్ స్కూల్ విద్యార్థుల వన మహోత్సవం ర్యాలి...
👉 నాటిన మొక్కలను కాపాడుకుంటామంటూ స్కూల్ ప్రిన్సిపాల్,సిబ్బంది, విద్యార్ధులు ప్రతిజ్ఞ
👉 పదర,పదర, పదర... అనే మహర్షి సినిమా పాటకు వేష ధారణతో హృదయానికి హత్తుకునేలా హావ భావ వ్యక్తీకరణతో నృత్యం చేసిన చిన్నారులు.
👉 విద్యార్థులకు జాగృతి అభ్యుదయ సంఘం ప్రోత్సాహక సర్టిఫికేట్ లు ప్రధానం
కార్యక్రమంలో భావన శ్రీనివాస్ తో పాటు స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి మమత, ఇస్మాయిల్ గురూజీ,లయన్ రవీందర్ రెడ్డి, లయన్ జి.నరసింహులు, దారుణ్య, శోభన్ బాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment