జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవ వేడుకలు

 తలుపు తట్టి మేల్కొలుపుదాం!! జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవ వేడుకలు





బి.ఎన్.రెడ్డి డివిజన్ శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని...  భూమిని కాపాడుకుందాం! భూమి పైన ఉన్న చెట్టును కాపాడుకుందాం!! చెట్లను ఆధారంగా చేసుకున్న పశుపక్షులను కాపాడుకుందాం!!! అనే గొప్ప ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు మరియు విద్యార్థినీ విద్యార్థులు గడపగడపకు "తలుపు తట్టి మేలుకొలుపుదాం"  కార్యక్రమాల్లో... ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల భూమాతకు కలిగేటువంటి నష్టాలను వివరిస్తూ వాటి స్ధానంలో అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయ వస్తువులను ప్రదర్శించడం జరిగింది.

 అదేవిధంగా ప్రస్తుత తరుణంలో పల్చబడి పోతున్న ఓజోన్ పొర, రకరకాల క్యాన్సర్ కారక ఆహార పదార్థాలు, వ్యవసాయ పొలాల్లో వాడుతున్న రసాయనాలు, సెల్ ఫోన్ రేడియేషన్, నీటిని అధికంగా వాడడం, భూ గర్భ జలాలు అడుగంటి పోవడం,

విద్యుత్,పెట్రోల్ లాంటి వనరుల దుర్వినియోగం తదితర అంశాలతో పాటు భూసారాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించవలసినటువంటి సహజ పద్ధతులను వివరిస్తూ ప్రతి ఇంట్లో వ్యక్తులు ఒక చేతి సంచితో, టిఫెన్ బాక్స్, ఫ్లాస్క్ లతో బయటికి వెళ్లాలనేటువంటి గొప్ప ప్రతిజ్ఞ చేపిస్తూ ఇంటింటి మహా ర్యాలీని నిర్వహించారు. చేతి సంచి వాడకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. వ్యవసాయ భూమి మొత్తంగా రియల్ ఎస్టేట్ గా మారిపోవడంతో సహజంగా భూమి పైన ఉండే పచ్చదనం తొలగిపోయి సంవత్సరానికి మూడు పంటలు పండే పంటలు పండించక నేల ఎండిపోయి బీడువారిపోతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.అటువంటి వారికి ప్రభుత్వం ప్రతి వెంచర్లో తగినన్ని చెట్లు ఉంటేనే నిర్మాణ అనుమతులు అందజేయాలని విద్యార్థులు అభిప్రాయ పడ్డారు. గత 15 సంవత్సరాలుగా ఆచరణతో కూడిన సేవా కార్యక్రమాలను జాగృతి అభ్యుదయ సంఘం తరఫున నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తూ దినచర్యలో పర్యావరణ హిత ఉత్పత్తులు అందరూ ఉపయోగించుకునే విధంగా  ముందుకు తీసుకెళ్తున్నామని శ్రీ భావన శ్రీనివాస్ అన్నారు.

శుభకార్యాల్లో తిరిగి వాడుకునే స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లను కట్లెరీ బ్యాంక్ ద్వారా ఉచితంగా ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.

   ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతి సంచిని ఉపయోగించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి గడపకి ఒక శీల కొట్టి ఆ శీలకు బట్టసంచిని తగిలించి వారి చేత ప్రమాణం చేపిస్తూ బ్యాగ్ లు ఉచిత పంపిణీ చేశారు.


Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.