21-11-2024 జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేయడం జరిగింది.

సఫాయన్నా సలామన్నా👏 చలికాలం తెల్లవారుఝామున ఎముకలు కొరికే చలిలో సైతం రోడ్లు ఊడుస్తూ జనాలకు ఆరోగ్యాన్ని పంచే BN Reddy Dvn GHMC పారిశుధ్య కార్మికులకు మరియు గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ కట్టుబడి బిల్డింగ్ ల వద్ద గుడిసెల్లో నివాసం ఉండే వాచ్ మెన్ కుటుంబాలకు జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. Ghansyam Bansal, Vimal Bhansal దంపతుల సహకారంతో సాయి మందిరం, గాయత్రి నగర్ బ్యాంక్ కాలని వేదికగా జరిగిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన GHMC హయత్ నగర్ సర్కిల్ Dy E Dr. నీలిమా మాట్లాడుతూ తమ కార్మికుల శ్రమను ప్రతి సంవత్సరం గుర్తిస్తూ రగ్గులు పంపిణీ చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్తూ, అలుపెరుగని 15సం.ల జాగృతి సేవలను కొనియాడారు. జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి శ్రీరంగనాధ్, సాయిమందిరం కమిటీ ప్రతినిధులు సరస్వతి, పద్మ, సంతోషి, మాధవి, GHMC యాదగిరి, యాదయ్య, యోగా టీచర్ సంధ్య, పిల్లా వెంకట సుబ్బారావు, పాపయ్య, భూషణంలతో పాటు మహిళలు పాల్గొన్నారు.