ENVIRONMENTAL PROTECTION AWARENESS ACT



 ప్రత్రిక వివరణ

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రకృతితో చెలిమి చేద్దాం! ...భావన శ్రీనివాస్.


HMDA హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు

వన మహోత్సవం...

స్థలం:

డిస్కవరీ ఓక్స్ స్కూల్

పెద్ద అంబర్ పేట.

కార్యక్రమం:

జాగృతి అభ్యుదయ సంఘం వ్యవస్థాపక ఛైర్మన్ భావన శ్రీనివాస్ నేతృత్వంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా డిస్కవరీ ఓక్స్  స్కూల్ లోని విద్యార్ధులకు  ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్గించారు. 6 ఎకరాలలో విస్తరించిన

విశాలమైన పాఠశాల కొంత ప్రాంగణంలో 150 మొక్కలు నాటడంతోపాటు విద్యార్ధులకు అందచేశారు.

ఈ సందర్భంగా భావన శ్రీనివాస్ మాట్లాడుతూ... నేడు అతివృష్టి , అనావృష్టి వికృత పరిస్థితులకు కారణం వాతావరణ సమతుల్యం లోపించడమేనని, దానికి కారణం మనిషి మాత్రమే అని, ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూల జీవనశైలిని దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారానే తిరిగి ఆరోగ్యంతో కూడిన సంతృప్తి జీవితం గడపగలుగుతామని అన్నారు.


పర్యావరణానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొదటి ప్రాధాన్యతా ఓటు,ఒట్టు వేసి మొక్కల పట్ల ప్రేమను, స్నేహాన్ని పంచుతూ, పెంచుతామని విద్యార్ధులు తమ బాధ్యతను,అంగీకారాన్ని తెలియపరుస్తూ తోటి మిత్రులకు ఛాలెంజ్ చేశారు.

 స్కూల్ నిర్వహణా పద్ధతులు అద్బుతంగా ఉన్నాయి అని భావన శ్రీనివాస్ గారు కొనియాడారు. 

కార్యక్రమంలో స్త్రీ హస్తిన మహిళా మండలి అధ్యక్షురాలు Dr ఎర్రం పూర్ణశాంతి గుప్త కూడా పర్యావరణ పరిరక్షణలో "నా" పాత్ర అనే అంశం మీద తాము జరుపుతున్న పోటీల నిర్వహణ నియమాలను తెలియజేశారు. 

ఈ పోటీలలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా పాల్గొనచేయాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరారు.

కార్యక్రమంలో పాఠశాల డీన్ సుధీర్ గారు, ప్రిన్సిపల్ సారా, సాగరికా బోస్, కిరణ్, సురేష్,రాధిక,అమృత, సరిత గార్లు,మరికొంత మంది ఉపాధ్యాయులు,పిల్లలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.