FRIENDSHIP WITH PLANTS
Friendship with plants
మొక్కలతో స్నేహం శాస్త్రీయమైనదే....
ఆగస్ట్ నెల మొదటి ఆదివారం Friendship day సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో బి.ఎన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ లో పలు రకాల పండ్లు,ఔషధ మొక్కలు నాటడం, గార్డులు ఏర్పాటూ జరిగినది. అనంతరం ఆ మొక్కలకు Friendship Bands కట్టి మొక్కలపట్ల స్నేహ భావాన్ని వ్యక్తం చేయడమైనది.
*ఈ సందర్భంగా భావన శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కలు స్పందిస్తాయని JC Bose శాస్త్రీయంగా నిరూపించారని,కాబట్టి మొక్కలతో స్నేహం, పలకరింపు సహేతుకమైనదేనని,
తప్పనిసరి పరిస్థితుల్లో చెట్లు తీయవలసొచ్చినా, కొమ్మలు నరకవలసివచ్దినా కూడా ఆయా చెట్లను క్షమాపణ కోరుతూ ఆ కొట్టిన స్ధానంలో ఏర్పడిన కొరతకు బదులుగా కొత్త మొక్కలు పలానా చోట నాటుతానని,పెంచుతానని మనసులో ప్రమాణం చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రకృతి ఆగ్రహానికి గురి కాక తప్పదని అన్నారు.
నాటిన మొక్కలకు దగ్గరగా నివాసం ఉండే రవికుమార్, తేజ గార్లు దత్తత స్వీకారం ద్వారా వాటి సంరక్షణా బాధ్యతలు తీసుకున్నారు.
కార్యక్రమంలో మొక్కలు నాటడం ద్వారా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న డాక్టర్ భావన, కాలనీ వాసులు శేఖర్, ఉదయ్,సూర్యకుమారి, రమేష్, వెంకటేశ్వరా కాలనీ అధ్యక్షులు రాంబాబు, క్రిష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment