Unite and Green India Campaign








🌴 *నేను నా కులం అని కాదు..మన అందరిది ఒకటే కులం... కార్తీకమాస కులాంతర సహపంక్తి వనభోజనాల కార్యక్రమంలో యం.ఎల్.ఎ సుధీర్ రెడ్డి*
🌴సమసమజా నిర్మాణం కోసం ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలకు చెందిన సభ్యులతో కలిసి భోజనం చేసిన సుధీర్ రెడ్డి గారు..
🌴వచ్చే 2030 వరకు అన్ని కులాల వారు కలిసి ఒకే చోట కార్తీకమాస సహపంక్తి భోజనం చేయాలి.
🌴కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్లే ప్రతి ఒక్కరు బట్ట సంచి వెంట తీసుకెళ్లాలి.
🌴ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
🌿ఆహుతలందరకు పర్యావరణ  బట్టసంచుల ఉచిత పంపిణీ...
🌿 నియోజక వర్గంలో దశాబ్ద కాలం పైగా జాగృతి అభ్యుదయ సంఘము సేవలు అభినందనీయం.
🌴వర్షాకాలంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి.
🌴రాబోయే రోజుల్లో ఎల్.బి.నగర్ నందు పర్యావరణ పరిరక్షణ విషయంలో ఒక గొప్ప మార్పు చూస్తాము.
ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.

ఈ రోజు గుర్రంగుడా సంజీవని వనం నందు గౌరవ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్  భావన శ్రీనివాస్ సభాద్యక్షతన... "సమ సమాజ నిర్మాణం కోసం కార్తీకమాస కులాంతర సహపంక్తి వన భోజనాల" కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి జీవికీ జీవనాధారం ప్రకృతి. ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
గ్లోబల్ వార్మింగ్,అడవుల నరికివేత,గాలి కాలుష్యం, ప్లాస్టిక్ వంటివి పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణం.వాతావరణంలొ వచ్చే మార్పులు,ప్రకృతి వైపరీత్యాలు,భూకంపాలు,సునామీలు,అగ్ని పర్వతాలు బద్దలవడం,ఇండ్రస్టియల్ పొల్లుష్యన్ వల్ల మానవాళిపై పెను ప్రభావం పడుతుంది.ఇటువంటి పరిస్థితుల్లో సానుకూల మార్పుకు రైతులు,విద్యార్థులు,ప్రభుత్వాలు,స్వచ్ఛంద సంస్థలు భవిష్యత్ హరిత పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.సకల జీవరాశులు,మానవ మనుగడ సాగించడానికి పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యం.ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి గ్రామంలో చెట్లు నాటాలి.పొల్యూషన్,గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి.రోడ్ల వెంబడి,పొలం గట్ల మీద,ఖాళీ ప్రదేశాలలో,కాలనీల యందు విరివిగా మొక్కలు నాటాలి.వాహనాల వాడకాన్ని తగ్గించాలి అని తెలిపారు.కావున ప్రతి ఒక్కరు తమ వంతు విధిగా తమ,తమ కాలనీల యందు ఇంకుడు గుంతలు,మొక్కలు నాటలాని పిలుపునిచ్చారు.రాబోయే తరాలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి.రాబోయే రోజుల్లో పర్యావరణ కాలుష్యం ఎక్కువ అవుతోంది అని ఎవరు మాస్కులు పెట్టుకునే పరిస్థితి రావొద్దు.అనంతరం కార్యక్రమానికి వచ్చిన వివిధ కుల సంఘాలు నాయకులతో కలిసి దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారు అరిటాకుల్లో భోజనం చేశారు.ఇట్టి కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘము,మరియు ఎల్.బి.నగర్ నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ భావన శ్రీనివాస్,హస్తినపురం డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బానోతు సుజాత నాయక్,మాజీ కార్పొరేటర్లు  ముద్రబోయిన శ్రీనివాసరావు,జిట్టా రాజశేఖర్ రెడ్డి,కొప్పుల విఠల్ రెడ్డి,సాగర్ రెడ్డి,భవాని ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు బిచేనేపల్లి.వెంకటేశ్వరరావు,వెంకటేష్ గౌడ్,తులసి శ్రీనివాస్, శ్రీరంగనాధ్, గోపాల్ దాస్ రాము, యాదా రామలింగేశ్వరరావు, V.B గాంధి, సత్యనారాయణ, శివ,పలు డివిజన్ల అధ్యక్షులు జక్కిడి.మల్లారెడ్డి,శ్రీశైలం యాదవ్,చిరంజీవి,మహేష్ యాదవ్,సత్యంచారి,వరప్రసాద్ రెడ్డి,రాజిరెడ్డి, Ch.v.r.k.మూర్తి, శ్యామలాదేవి, రాజేందర్, శ్రీధర్, వెంకట్, క్రిష్ణా రెడ్డి, శ్రీనివాస్ గుప్తా,  CK Rao, శ్రవణ్ కుమార్, కోమలి, వెంకట్ నారాయణ,  వనజ, శ్రీకాంత్, సీతారామ శర్మ, లక్ష్మణరావు, స్వప్న, కోటి రత్నం, లక్ష్మి మరియు పలువురు మాజీ డివిజన్ అధ్యక్షులు,నాయకులు,పలువురు కులసంఘాల సభ్యులు పాల్గొన్నారు.
 

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.