సాహెబ్ నగర్ డివిజన్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం

 *సాహెబ్ నగర్ డివిజన్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం*


👉 అన్నదానం కన్నా గొప్పది మండు వేసవిలో జలదానం - దక్షిణ భారత గోరక్షక్ ప్రముఖ్ టి.యాదగిరిరావు.

👉 భగభగ మండుతున్న భానుడి ప్రతాపానికి తడారిపోతున్న గొంతుకల దాహం తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు - శ్రీరామ సేన నవీన్ వల్లోజు 


👉 సామాజిక బాధ్యతగా గుర్తెరిగి సాహెబ్ నగర్ డివిజన్ ఇంజాపూర్ రహదారిలో  బాటసారుల, వాహనచోదకుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు - జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్.



👉 వాడిపారేసే ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా, మినరల్ వాటర్ మాత్రమే కాకుండా మజ్జిగ కూడా ఉచిత పంపిణీకి మా వెంకటేశ్వర కాలనీని వేదికగా ఎంచుకున్నందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు, కాలనీ తరపున నా వంతు సహకారం కూడా అందిస్తాను - కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాటి రాంబాబు గౌడ్.


👉 బంకుల్లో పెట్రోల్ కొన్నట్లుగా ట్యాంకుల్లో వాటర్ కొనాల్సి రావడం వలన బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు ఖర్చు కాకూడదనే ఆలోచనతో ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు  అభినందనీయం - డాక్టర్ విజయ్ కుమార్.   

    సూపర్ ఎల్.నినో ప్రభావంతో మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూండటం వలన కొద్ది దూరం ప్రయాణానికి కూడా వేసవి తాపం ఆటంకం కాకూడదనే ఆలోచనతో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాహెబ్ నగర్ ఇంజాపూర్ రహదారిలో శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలని గణేష్ మండపం వద్ద పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మినరల్ వాటర్ చలివేంద్రం ఈరోజు ప్రారంభించడం జరిగింది. 


శ్రీరామ సేన, జాగృతి అభ్యుదయ సంఘం, సంతోషి మాతా టెంపుల్, విప్రసేవా సమితి, శ్రీ వెంకటేశ్వర కాలని,  రాజా పాల డైరి సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో షుమారు 2 నెలల పాటు ఈ చలివేంద్రం కొనసాగించాలనే ఆలోచనతో మొదలు పెట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు హాజరైనారు. 

పుట్టిన రోజు, పెళ్లి రోజు తదితర సంబరాలను తక్కువ ఖర్చుతో జరుపుకోవాలనేవారు కనీసం ఒక్కరోజు మజ్జిగ పంపిణీకి విరాళం ఇవ్వొచ్చునని వంశీకృష్ణ అన్నారు. 


     కార్యక్రమంలో పై వక్తలతో పాటు గోపాల్ దాస్ రాము, గాయత్రి నగర్ అధ్యక్షురాలు రాధా విష్ణు మోహన్, నాగిరెడ్డి కాలని అధ్యక్షులు జి.వెంటేష్ గౌడ్, శివ శంకర్, జాగృతి ప్రతినిధులు యాదా రామలింగేశ్వరరావు, శ్రీరాములు గౌడ్, శరత్ నలమార, సత్యనారాయణ, కోటేశ్వర్రావు, కాశెట్టి ప్రకాష్ శెట్టి, భాస్కర్, శ్రీధర్ శర్మ, వెంకటేశ్వర కాలనీ ప్రతినిధులు రాజు గౌడ్, బొమ్మరాజు శ్రీనివాస్, జైపాల్, లక్ష్మయ్య, రమేష్, గాయత్రి నగర్ ప్రతినిధులు శ్రావణి సమీర్, నీనా భవాని, మీనాక్షి,  నాగిరెడ్డి కాలని ప్రతినిధులు పద్మావతి, సి.హెచ్. వెంకటేష్, కె.వి.రమణయ్య, వాసవి, జయరాం, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు...

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025