JUN-21-2024 INTERNATIONAL YOGA DAY
యోగా చేద్దాం రోగాలకు దూరంగా ఉందాం
జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా హయత్ నగర్ కోర్ట్ 14వ అదనపు జడ్జి సల్మా ఫాతిమా గారు మరియు 7వ అదనపు జడ్జి సంకేత్ మిత్రా గార్ల ఆహ్వానం మేరకు జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ కోర్టు జడ్జిలకు,బార్ అసోసియేషన్ లాయర్లకు, కోర్ట్ పోలీసులకు, సిబ్బందికి కోర్టు ప్రాంగణంలో యోగా నేర్పించడమైనది.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా నిత్యం దినచర్యలో భాగమైతే రోగాలు గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సంపాదనే ధ్యేయంగా హడావుడి,యాంత్రిక జీవితానికి అలవాటు పడటం వలన చిన్న వయసులోనే రోగాలపాలై ముక్కుతూ మూలుగుతూ మందులు వాడుతూ కష్టార్జితాన్నంతా ఆ రోగాలు తగ్గించుకోడానికే హాస్పటల్స్ కు ఖర్చు చేయాల్సి వస్తుందని, అలా కాకుండా ప్రతి నిత్యం కొంత శారీరక శ్రమ, మానసిక ఉల్లాసాన్ని కలిగించే అష్టాంగ యోగా సాధన చేయడం వలన సుధీర్ఘ కాలం పాటు సంపాదించుకోవడానికి, ఏదైనా సాధించడానికి శరీరం సహకరిస్తుందని అన్నారు.
ఎటువంటి ఫీజులు ఆశించకుండా భారతీయులు పటిష్టంగా ఆరోగ్యంతో ఉండాలనే సదాలోచనతో యోగా నేర్పించిన భావన శ్రీనివాస్ సేవలను జడ్జిలు, సిబ్బంది కొనియాడారు.
కార్యక్రమంలో "యోగా చేద్దాం - రోగాలను దూరం చేద్దాం" అంటూ సభ్యులు నినదించారు.
జై భారత్ మాత💪🇮🇳
Comments
Post a Comment