December 5 "World Soil Day"2024
నేలను పాడు చేసుకుంటే మీరు పంటలు ఎక్కడ పండిస్తారు ?
👉 భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా భావన శ్రీనివాస్
December 5 "World Soil Day" సందర్భంగా GHMC స్వచ్ఛభారత్ మిషన్ పిలుపు మేరకు జాగృతి అభ్యుదయ సంఘం మరొక ముందడుగు వేసింది.
'నేటి బాలలే రేపటి పౌరులు' అన్న పెద్దల మాటలను నమ్ముతూ విద్యార్ధి దశ నుండే పిల్లల్లో "నేల" ప్రాముఖ్యత/అవసరం గురించి, నేలతల్లి కాలుష్యం వల్ల తలెత్తే దుష్పరిణామాలు, పరిష్కార మార్గాల గురించి విద్యార్థులకు చెప్పి వారిని చైతన్య పరచారలనే సదాశయంతో పోచంపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల HMగారి ఆహ్వానం మేరకు వారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశమునకు భావన శ్రీనివాస్ హాజరైనారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
*కన్న తల్లి 9నెలలు మోస్తే నేలతల్లి 90సం.లు మొయ్యాలని,
అటువంటి నేలమ్మ గర్భంలోకి వ్యవసాయం పేరుతో హానికారక కృత్రిమ ఎరువులు, విష రసాయనాలు చొప్పించడం వలన నేల సారం కోల్పోయి కొన్నాళ్ళకు చౌడు భూములుగా తయారై శాశ్వతంగా జీవాన్ని కోల్పోతుందని,
వాటి స్ధానంలో గోమయం, గోమూత్రం తదితర మిశ్రమాలతో చేసిన జీవామృతం లాంటి సహజ ఎరువులు వాడడం వలన భూసారం పెరగడంతో పాటు మట్టిలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వృద్ధి చెంది పంటల అధిక దిగుబడి కి దోహదపడతాయని అన్నారు.
ఏక వినియోగ ప్లాస్టిక్ ఉత్పత్తులను విచ్చలవిడిగా వాడి పారేయడం వలన అవి పంట భూముల్లోకి చేరి మొక్కల ఎదుగుదలకు అడ్డు పడతాయని, వర్షపు నీరు భూమిలోకి ఇంకి పోకుండా అడ్డపడతాయని, తద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోతాయని అన్నారు. తిరిగి వాడుకునే వస్తువుల వినియోగంతో ప్లాస్టిక్ కు స్వస్తి చెప్పవచ్చన్నారు.
మార్కెట్లో అందు బాటులో ఉన్న ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను శ్రీనివాస్ ప్రదర్శించారు.
విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయనులు కూడా ఇకనుండి భూమాతకు నష్టం కల్గించే ఏ పని చేయబోమని ప్రమాణం చేశారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటికి సంరక్షణ గార్డులు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో పాఠశాల HM రమాదేవి, టీచర్లు కమల కుమారి, శ్రీలత, మెర్సీ, నిర్మల, కరుణా దేవి, హిమబిందు, సుబ్బారావు, కుమార్, విద్యార్ధినులు పాల్గొన్నారు.
Comments
Post a Comment