10-08-2024 తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించడమంటే తెలుగు భాషను, తెలుగు వారందరినీ కించపరిచినట్లే.



తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగించాలి మరియు ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి ఆయన త్యాగాన్ని గౌరవించాలి. పొట్టి శ్రీరాములు గారి పేరును తొలగించడం అంటే మొత్తం తెలుగుజాతిని, ప్రతి తెలుగువాడిని అవమానించినట్టేనంటూ
👉 జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షులు భావన శ్రీనివాస్ గారు మరియు  ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్ జె ఎస్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో వనస్ధలిపురం గణేష్ కాన్ఫరెన్స్ హాల్ వేదికగా జరిగిన సమావేశంలో  సభ్యులు కలిసి ప్రకటించిన తీర్మానం..
     భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం తోటి ఏర్పడిందని, వారు 54 రోజుల ఆమరణ నిరాహారదీక్షలు చేసి ప్రాణాలర్పించిన కారణంగా పెల్లుబికిన ప్రజా ఉద్యమం తోటి అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు వారందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధించినదని, వారి ప్రాణ త్యాగానికి కృతజ్ఞతగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వారి విగ్రహాలు ప్రతిష్ఠించి ఇప్పటికీ 'అమరజీవి' గా కొలుస్తున్నారని, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక నెల్లూరు లాగా కనీసం ఒక జిల్లాకైనా ఆయన పేరు పెట్టి ఆయనను గౌరవించాల్సినది పోయి తెలుగు యూనివర్సిటీకి ఉన్న ఆయన పేరుని తొలగించాలనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన శోచనీయం అని, తక్షణం ఆ ఆలోచనని విరమించుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కొనసాగించే ప్రకటన CMగారు చేసి తెలుగు ప్రజల అభిమానాన్ని తిరిగి పొందాలని, ఆ ప్రకటన కోసం తెలుగు వారితో పాటు తెలుగు భాషాభిమానుంలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు.
    భారతదేశంలోని భాషా ప్రాతిపదికన హైదరాబాద్ లో నెలకొల్పిన, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించిన ఈ యూనివర్సిటీకి 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గా పేరు పెట్టి 2010లో పరిపాలనా పరంగా సాంస్కృతిక శాఖలో భాగమైందని గుర్తు చేశారు.
    సమావేశంలో.. జీరో బడ్జెట్ పాలిటిక్స్, సైబర్ క్రైమ్ వారియర్ శ్రీ పోతిరెడ్డి మాధవరెడ్డి, లయన్స్ క్లబ్ వనస్ధలిపురం అద్యక్షులు విట్టా దూరయ్య, డాక్టర్ రవికుమార్ మర్రు, డాక్టర్ నవీన్ గుప్తా, సతీష్, వరప్రసాద్, సహకార్, వెంకటేశమ్, నాగలక్ష్మి , సువిధ, రోషన్, లింగయ్య, గిరి, రాము, పురుషోత్తం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.