World Sparrow Day


 *బ్రతకనిస్తే అవి మనకి బ్రతుకునిస్ధాయి*


మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా....

జాగృతి అభ్యుదయ సంఘము ఆధ్వర్యంలో

 ఈరోజు

ఎల్.బి.నగర్ గౌ.శాసన సభ్యులు డాక్టర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిచే వారి కార్యాలయం ఆవరణలో పిచ్చుక గూళ్ళు పంపిణీ చేయడమైనది, మరియు పిచ్చుకల పెంపకం పట్ల వారి బాధ్యతను నిర్వర్తిస్తూ వారే స్వయంగా వారి కార్యాలయం ప్రాంగణంలో పిచ్చుక గూళ్ళు కట్టడంతో పాటు వాటి ఆకలి, దాహార్తిని తీర్చేందుకు గింజలు చల్లి మట్టి మూకుడులో నీళ్ళు పోయడమైనది.


*మన ఆహార పంటలను ఆశించి వచ్చే చీడ పురుగులను తినేసి మనకు పరోక్షంగా ఆహారాన్ని మిగుల్చుతాయి పిచ్చుకలు, కాబట్టి పిచ్చుకలను కాపాడుకోవాల్సిన అవసరం మనిషికుంది.

*జీవి వైవిద్యం ద్వారా 84 లక్షల జీవరాశులు బ్రతికేట్టుగానే జీవం పోశాడు సృష్టికర్త, భగవంతుడి సృష్టిని శాసించే/నాశనం చేసే హక్కు మనిషికి లేదు, అది తెలియక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయిస్తూ దానిని గుప్పెట్లో పెట్టుకోవాలనే స్వార్ధపూరిత ధోరణితో తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు నేటి ఆధునిక మానవుడు.

అది గ్రహించిన మేము గత దశాబ్ద కాలం పైగా "పర్యావరణ పరిరక్షణ" ప్రధాన లక్ష్యంగా పలు ఆచరణాత్మక/ అవగాహన కార్యక్రమాలు చేస్తుంది మా జాగృతి అభ్యుదయ సంఘము స్వచ్చంద సంస్ధ.


ప్రత్యేకించి వేసవి కాలంలో పిచ్చుకల మనుగడకు మట్టితో మరియు అట్టతో చేసిన కృత్రిమ పిచ్చుక గూళ్ళు, వాటి దాహార్తిని తీర్చేందుకు మట్టి మూకుళ్ళు, తిండి గింజలు ప్రతి సంవత్సరం ఉచితంగా హైదరాబాద్ పట్టణం లోని వేర్వేరు కాలనీల్లో పంపిణీ చేస్తుంది మా స్వచ్చంద సంస్ధ.


మొదటిగా మా ఇంట్లో తగిలించిన ఆ గూళ్ళలోకి పిచ్చుకల జంటలు వచ్చి చేరాయి, వాటితో పాటు వాటి పిల్లల కిచకిచకిచలతోటి ఎంతో ఆహ్లాదానుభూతి, మానసికోల్లాసం కలుగుతుంది మా ఇంట్లో అందరికీ.,

ప్రత్యేకించి మన పిల్లలకు ఇలాంటి వాతావరణాన్ని అందుబాటులోకి తెస్తే వాళ్ళు వీడియో గేమ్ లు, టి.వి.లకు, మొబైల్ ఫోన్లకు అలవాటై చెడిపోకుండా ప్రకృతితో మమేకమై సంతోషాన్ని పొందడంతో పాటు ఆరోగ్యంగా జీవిస్తూ ప్రయోజకులై కుటుంబాన్ని, దేశాన్ని ఉద్ధరించే బాద్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ అన్నారు.


ఈ కార్యక్రమంలో... శ్రీరంగనాధ్, గోపాల్ దాస్ రాము, యాదా రామలింగేశ్వరరావు, ఓబులేష్ యాదవ్, ఎ.సత్యనారాయణ, నంబూరు తాతయ్య, సాకేత్ తదితరులు పాల్గొన్నారు.


*మేలుకుంటే-కోలుకుంటాం!!*

-

భవదీయుడు... 

భావన శ్రీనివాస్, 

వ్యవస్ధాపక ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘము, వనస్ధలిపురం, హైదరాబాద్.




Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.