మార్చి 22. 2025 ప్రపంచ జల దినోత్సవం రోజున మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం
మార్చి 22. 2025 ప్రపంచ జల దినోత్సవం రోజున మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం
👉రిబ్బన్ కత్తిరించి మజ్జిగ పంపిణీతో ప్రారంభించిన వనస్ధలిపురం CI శ్రీనివాసులు
👉జల వనరులను పొదుపుగా వాడుకుంటామంటూ సభికుల ప్రమాణం
ఎండాకాలం ప్రయాణీకుల దాహార్తిని తీర్చే సదాలోచనతో సామాజిక కార్యకర్తలైన భావన శ్రీనివాస్(JAS Chairman), పంది కృష్ణ(శ్రీ వెంకటేశ్వర కాలని అద్రక్షులు), యాదగిరి రావు(విప్ర సేవా సమితి అధ్యక్షులు), వంశీకృష్ణ(టెక్కీ రైడ్ సభ్యులు), సురేందర్(సాఫ్ట్వేర్), లక్ష్మీ శ్రీ (సంతోషి మాత టెంపుల్ ఛైర్మన్)లు కలిసి బి.ఎన్.రెడ్డి తూర్పు శివారు కాలనీవాసుల సౌకర్యార్థం గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ విప్ర సేవా సమితి ప్రక్కన, వెంకటేశ్వర కాలని సంతోషి మాతా దేవాలయ కమాన్ ఎదురుగా ఉన్న రహదారి నందు మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించడమైనది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వనస్ధలిపురం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ హితం కోసం స్వచ్చందంగా పాటుపడుతున్న ఇలాంటి కొందరి కారణంగానే సమాజం ఇంకా మనుగడ సాగిస్తుందని, ఎండ వేడికి అల్లాడుతూ, దాహంతో తడి ఆరిపోయే గొంతుకలకు చల్లటి మినరల్ వాటర్ ను బాట సారుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలు దోహద పడతాయన్నారు.
మార్చి 22 World Water Day ను పురస్కరించుకుని... నేల తల్లిని కాలుష్యం నుండి కాపాడుకుంటామని, భూగర్భ జలాలు అడుగంటి పోకుండా స్వచ్చందంగా ఇంకుడు గుంతలు తీసుకుంటామని, ప్రతి నీటి చుక్క వృధా కాకుండా సద్వినియోగం అయ్యే విధంగా వనరులన్నిటిని కాపాడుకుంటామని, పర్యావరణ అనుకూల జీవన శైలిని దినచర్యలో భాగం చేసకుంటామని సభికులు ప్రమాణం చేశారు.
SI రవినాయక్, సామాజిక కార్యకర్త విజయ్ నేతలు అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో దాతలు NC మనోహర్, గడ్డం లలితాంబ, భారతి, రఘునాధ్ యాదవ్, S.రవి కుమార్, G.శేఖర్, భద్రారెడ్డి, క్రిష్ణ, సురేష్, రమేష్ రెడ్డి, మధు, సుధాకర్, ఊ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి, సిబ్బంది, జాగృతి వాలంటీర్లు పాల్గొన్నారు.
Comments
Post a Comment