Posts

Showing posts from March, 2025

మార్చి 22. 2025 ప్రపంచ జల దినోత్సవం రోజున మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం

Image
మార్చి 22. 2025 ప్రపంచ జల దినోత్సవం రోజున మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభోత్సవం  👉 రిబ్బన్ కత్తిరించి మజ్జిగ పంపిణీతో ప్రారంభించిన వనస్ధలిపురం CI శ్రీనివాసులు 👉జల వనరులను పొదుపుగా వాడుకుంటామంటూ సభికుల ప్రమాణం ఎండాకాలం ప్రయాణీకుల దాహార్తిని తీర్చే సదాలోచనతో సామాజిక కార్యకర్తలైన భావన శ్రీనివాస్(JAS Chairman), పంది కృష్ణ(శ్రీ వెంకటేశ్వర కాలని అద్రక్షులు), యాదగిరి రావు(విప్ర సేవా సమితి అధ్యక్షులు), వంశీకృష్ణ(టెక్కీ రైడ్ సభ్యులు), సురేందర్(సాఫ్ట్వేర్), లక్ష్మీ శ్రీ (సంతోషి మాత టెంపుల్ ఛైర్మన్)లు కలిసి బి.ఎన్.రెడ్డి తూర్పు శివారు కాలనీవాసుల సౌకర్యార్థం గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ విప్ర సేవా సమితి ప్రక్కన, వెంకటేశ్వర కాలని సంతోషి మాతా దేవాలయ కమాన్ ఎదురుగా ఉన్న రహదారి నందు మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించడమైనది.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వనస్ధలిపురం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ హితం కోసం స్వచ్చందంగా పాటుపడుతున్న ఇలాంటి కొందరి కారణంగానే సమాజం ఇంకా మనుగడ సాగిస్తుందని, ఎండ వేడికి అల్లాడుతూ, దాహంతో తడి ఆరిపోయే గొంతుకలకు చల్లటి మినరల్ వాటర్ ను బాట స...

మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025

Image
 మార్చి 20  ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుక గూళ్ళు, నీళ్ళ చిప్పలు, గింజలు, డాగ్ బౌల్స్, క్లాత్ బ్యాగ్స్ పంపిణీ. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2025

Image
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు బి.ఎన్.రెడ్డి డివిజన్ వివేకానంద విద్యా వికాస్ కేంద్రంలో  బాల బాలికలు పాల్గొని "బాల్య వివాహాలను రూపుమాపటం" కోసమై రంగస్థల నటుడు శాంతారావు గారు రూపొందించిన మల్లె మొగ్గ అనే నాటిక ప్రదర్శించారు. పల్లె ప్రాంతాల్లో ఇప్పటికీ 25శాతంగా జరుగుతున్న బాల్య వివాహాల వలన శారీరకంగాను, ఆర్ధికంగాను, కుటుంబ పరంగానూ ఎదురయ్యే కష్టనష్టాలను ఆలోచింప చేసే విధంగా హృద్యంగా ప్రదర్శించిన నాటికను పిల్లలు మరియు  పెద్దలు ఆసక్తిగా తిలకించారు.  కార్యక్రమానికి వివేకానంద విద్యా వికాస్ కేంద్రం,  జాగృతి అభ్యుదయ సంఘం, లైట్ ఆర్గనైజేషన్ మరియు వనమాలి సంస్థ వారు సహకారం అందించారు.       లైట్ ఆర్గనైజేషన్ చైర్మన్ శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ పిల్లలందరూ ఆడ మగ అందరూ సమానమేనని, ఎక్కువ తక్కువల తారతమ్యాలు ఉండకూడదు అని అన్నారు. జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గతంతో పోలిస్తే మహిళలు చాలా చైతన్య వంతులైనారని, కుటుంబానికే కాకుండా సమాజంలోకొచ్చి రాజకీయ పదవుల్లో కూడా రాణిస్తున్నారని, మహిళలు పురుషులు ఒకరికొకరు  సమన్వయం చేసుకుంటూ తమ...