జాగృతి అభ్యుదయ సంఘం ఆద్వర్యంలో సంక్రాంతి పర్యావరణ ముగ్గుల పోటీలు. 2025
సందేశాత్మకంగా ముగ్గుల పోటీలు
జాగృతి అభ్యుదయ సంఘం, SKN కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ VOO SCHOOL వేదికగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
👉 SAVE EARTH
👉 Respect Farmer
అంటూ వేసిన పలు సందేశాత్మక ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి.
పోటీల అనంతరం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య(AIDWA) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మల్లు లక్ష్మీ గారి బృందం న్యాయం నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలకు మరియు పాల్గొన్న వారందరికీ "మొదటి ముద్ద" వారి విలువైన బహుమతులు అందచేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటినుంచి బైటికొచ్చి మహిళలు ముగ్గులు వేయడం వలన కలివిడితనంతో స్నేహభావం పెరుగుతుందని, నెల రోజులపాటు నడుం వంచి శారీరక శ్రమతో నిత్యం ముగ్గులు వేయడంతో చలి తాలూకు బద్దకం పోయి చురుకుదనం పెరుగుతుంది అని, తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టినట్లు అవుతుందని అని అన్నారు. మహిళా హక్కుల కోసం, వారిపై జరుగుతున్న అనేక రకాల దాడులను అడ్డుకునేందుకు AIDWA దశాబ్దాలుగా పోరాడి అనేక చట్టాలు సాధించినదని గుర్తు చేశారు.
కార్యక్రమంలో AIDWA రంగారెడ్డి జిల్లా నాయకులు సుమలత, సంధ్య,సంతోషి, SKN కళాక్షేత్రం డా||వెంకట్ ఆచార్య, క్రిష్ణ కుమారి, NC మనోహర్,జ్యోతి, మనోజ్ఞ, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్, పుష్పలత, సోని, శ్వేత, అరుణ, నంబూరు తాతయ్య, రమేష్, భావన, వెంకటేశ్వర కాలనీ ప్రతినిధులు రాంబాబు గౌడ్, లక్ష్మయ్య, కాలనీ వాసులు గణేష్ గౌడ్, వెంకట్ రెడ్డి, బలరాం, రుక్మిణి, లత, రక్షిత, హర్షిత, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment