ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు 2025.

రాజ్యాంగ చట్టాలను గౌరవించడమే నిజమైన దేశభక్తికి నిదర్శనం దేశ భక్తి గీతాల పోటీలు - విజేతలకు బహుమతులు పంపిణీ జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో 76 వ గణతంత్ర దినోత్సవమును పురస్కరించుకుని బి.ఎన్.రెడ్డి డివిజన్ సాహెబ్ నగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు "దేశభక్తి గీతాలాపన పోటీలు" నిర్వహించి విజేతలు - హారిక,శివాని, శృతి, మహాలక్ష్మి, సిద్దిక్ష లకు బహుమతులు పంపిణీ చేయడమైనది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దినేష్ గారు మాట్లాడుతూ ఈ పోటీలతో బాల్య దశలోనే విద్యార్ధుల్లో దేశభక్తి భావన పెరుగుతుందని, బాధ్యతాయుతమైన భారతీయులుగా ఎదగడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. ఈ పోటీలను నిర్వహించడానికి తమ పాఠశాలను ఎంచుకోవడం సంతోషంగా ఉందంటూ జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ కు HM దినేష్ కృతజ్ఞతలు తెలిపారు. పోటీల విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు ఉన్నత పాఠశాల, ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులకు భావన శ్రీనివాస్ పర్యావరణ హిత బట్టసంచులు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. చిన్న పెద్ద, కుల మత, పర తమ భేదం భావం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు తన స్వేచ్ఛను ప్రకటించుకునే విధంగా రూపొందించిన మన రాజ్యాంగాన్ని...