మట్టి గణపతులను పూజిద్దాం -పర్యావరణాన్ని కాపాడుకుందాం
ముందుచూపు
Ganesh Idols Immersion కొరకు GHMC ఏర్పాటు చేయబోయే Artificial Ponds లో మట్టి గణపతులను ఒకవైపు, కలర్ గణపతులను మరొకవైపు నిమజ్జనం చేయించాలని, అలా వేరుగా చేయించగా కరిగిన బంక మట్టిని విగ్రహాలు చేసేందుకు GMMC తిరిగి కుమ్మరి కళాకారులకు అందించాలని, అలా చేయడం వలన రాబోయే సంవత్సరాల్లో బంక మట్టి కొరతను, చెరువుల అధిక లోతు, చెరువులు పనికిరాకుండా పూడిపోయే సమస్యల నుండి బైట పడవచ్చునని జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షుడు భావన శ్రీనివాస్ సూచనలు చేస్తూ GHMC Hon'ble Mayor గద్వాల విజయలక్ష్మి గారికి, Commissioner ఆమ్రపాలి IAS(FAC)గార్లతో పాటు Addl Commissioner Electricity and Legal సత్యనారాయణ గారికి పర్యావరణ మట్టి గణపతి విగ్రహాలనిచ్చి గౌరవించడమైనది. వారు తన సూచనలకు సానుకూలంగా స్పందించినట్లు శ్రీనివాస్ తెలిపారు.
ఏటా మట్టి గణపతులకు గణనీయంగా పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా భవిష్యత్ లో ఎదుర్కొనబోయే పెద్ద సమస్యను ముందుగా గుర్తించి ఈ సూచనలను చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు
Comments
Post a Comment