👉జాగృతి అభ్యుదయ సంఘం మట్టి గణపతి విగ్రహాల పంపిణీలో వనస్ధలిపురం ACP కాశి రెడ్డి... రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని జాగృతి అభ్యుదయ సంఘం, రాజా పాల డైరీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బి.ఎన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ సాయి మందిరం వేదికగా కాలనీవాసులకు పర్యావరణ మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడమైనది. పంపిణీకి వనస్ధలిపురం ACP కాశిరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జీవితాలు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయని, పట్టించుకోకపోతే జీవితాలు ఆగమైపోతాయని, కాలుష్యం ఇలాగే పెరిగిపోతుంటే భవిష్యత్ లో జీవరాశి అంతమైపోతుందని, భావితరాల, మన పిల్లల ఆరోగ్యకర జీవనశైలి కొరకు ప్రకృతిని కాపాడుకోవడం ఒక్కటే శరణ్యమని, ఈ విషయమై 16 సం.లుగా జనాన్ని జాగృతం చేస్తున్న జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు అభినందనీయులని, జాగృతి ఛైర్మన్ గా భావన శ్రీనివాస్ చొరవ అమోఘం అని కొనియాడారు. పర్యావరణాన్ని రక్షించుకోవడం తనకు కూడా ఇష్టమని కాబట్టే బిజీ షెడ్యూల్ లో కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అని అన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జ...