Earth Day Celebration 22nd April 2024
ధరిత్రిని కాపాడుకుంటామంటూ జాగృతి బృందం ప్రమాణం
జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో శారదా నగర్ పార్క్ వేదికగా ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం వేడుకలు...
*చెత్త కుప్పను తలపించే ఇంకుడు గుంతను తిరిగి పునరిద్ధరించిన శారదా నగర్ కాలనీ ప్రతినిధులు.,
*భూమిలోకి నీరు ఇంకేట్లు చర్యలు తీసుకుంటాం
*భూమాత గర్భ శోకానికి కారణమయ్యే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల స్ధానంలో తిరిగి వాడుకునే స్టీల్ వస్తువులతోనే కార్యక్రమాలు జరుపుకుంటాము
*భూసారాన్ని తగ్గించే కృత్రిమ ఎరువులు, హానికారక వంట ఇంటి అంట్లు తోమే రసాయన సబ్బులు, వాషింగ్ సర్ఫుల వాడకాన్ని తగ్గిస్తూ భూమాతను కాపాడుకుందాం
అంటూ సభ్యులతో ప్రమాణం చేయించిన శారదా నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి KLN Rao.
ఈ సందర్భంగా...భూమిని మనం కాపాడితే,ఆ భూమాత మనల్ని రక్షిస్తుంది.. చెట్టు,చేమ, జంతుజాలం, అన్నింటికీ ఆహార సంపదలను సమకూర్చి కన్నతల్లిలా తనలో సృష్టి అంతటినీ ఇముడ్చుకునేది భూమాతే.... జీవం ఉన్నా, కాలధర్మం చెందినా, పక్షపాత ధోరణి లేకుండా సమానత్వాన్ని చూపేది భూమాతే.... మహదాకాశం నుండి మార్పులు చేర్పులు జరిగి, వాయువు, అగ్ని, అన్ని భూమి లో లయమై, అందరికీ బతుకు తెరువు ఆహారాన్ని కల్పించేది భూమాతే... భూమాత రుణం తీర్చుకోవడం అంటే కేవలం ప్రాత:కాల ప్రమాణంతో సరిపోదు, భూమి కి నష్టం వాటిల్లకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి... ఈ భూ మాతకు అనర్ధం జరగకుండా ఉంటే అది మనందరి ఉపయోగం కోసం అని మర్చి పోరాదు.... భూమాత,గోమాత, మాతృమూర్తులకు వందనం అని డా||శిరిపురపు అప్పారావు అన్నారు.
మనం నివసిస్తున్న ఈ భూగోళాన్ని కాపాడుకుందాము అని ప్రపంచ పర్యావరణ దినోత్సవం ( ఎర్త్ డే ) 22 ఏప్రిల్, 1970 ప్రారంభించి ఇప్పటకి 53 సంవత్సరాలు అయ్యింది. మీకో విషయం తెలుసా? 1970 లో పర్యావరణం బాగానే ఉండేది. ఈ దినోత్సవం మొదలుపెట్టాకే పర్యావరణ కాలుష్యము పెరిగింది. అంటే మాటలే తప్ప ఏ ప్రభుత్వం చేతలు లేవు. ఈ మాత్రం దానికి దినోత్సవాలు ఎందుకు? పోనీలెండి ఇప్పటినుంచి మనమైనా పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ భూమిపై ఇంకొన్నాళ్లు నివసించడానికి మన కర్తవ్యాన్ని పాటిద్దామంటూ అందరికీ భూ సంరక్షణ కర్తవ్య పాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు Ch.v.r.k.Murty గారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త కొండవీటి రాజేందర్ రెడ్డి, శారదా నగర్ కాలనీ సంక్షేమ సంఘం కార్యదర్శి కె యల్ యన్ రావు, సహకార్యదర్శి శ్రీమతి కె ఇందిర, సభ్యులు డి అరుణ, ఎ బాలకృష్ణ, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు శ్రీ వి ఆర్ కె హనుమంతరావు, భావరాజు ప్రసాద్,నివాసులు శ్రీనివాస్, యాదగిరి రావు, రామకృష్ణ, డాక్టర్ యస్ అప్పారావు, జాగృతి బృందం శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వరరావు,మంగపతిరావు, శ్రీరాములు గౌడ్, ప్రభాకర్, రవిశర్మ, సత్యనారాయణ, స్రవంతి, చంద్రశేఖర్ ,మహేష్ వాసులు పాల్గొనడం జరిగింది. మన భూమాత నుంచి జల్లెడకు చిల్లులు వుండే విధంగా నిత్యం వేలాది బోర్ వెల్స్ అత్యంత లోతుగా త్రవ్వి నీటిని ఆకాశ హర్మ్యాల ఎత్తుకు నిత్యం 24/7 తీసుకుని పోవడం వలన ఆ చుట్టుపక్కల వారికి కనీసం త్రాగు నీటికి కూడ కటకట లాడే పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రంధ్రాలు చేసే మనం కనీసం కొంత మేర అయినా తిరిగి ఇంకుడు గుంతలు తవ్వి వర్షపు నీటిని భూమిలోకి పంపే ప్రయత్నం చేయడం లేదు. దీనివల్ల మన చుట్టు పక్కల గల మహానగరాల్లో తీవ్రమైన నీటి సమస్య చూస్తూనే వున్నాం. మానవులు ఈ దుస్థితి నుంచి మారాలని కోరుతూ తాము మారుతామని పార్క్ నందు ప్రమాణం చేయించారు శారదానగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ KLN Rao....
-
భావన శ్రీనివాస్.
Comments
Post a Comment