Earth Day Celebration 22nd April 2024

ధరిత్రిని కాపాడుకుంటామంటూ జాగృతి బృందం ప్రమాణం జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో శారదా నగర్ పార్క్ వేదికగా ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం వేడుకలు... *చెత్త కుప్పను తలపించే ఇంకుడు గుంతను తిరిగి పునరిద్ధరించిన శారదా నగర్ కాలనీ ప్రతినిధులు., *భూమిలోకి నీరు ఇంకేట్లు చర్యలు తీసుకుంటాం *భూమాత గర్భ శోకానికి కారణమయ్యే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల స్ధానంలో తిరిగి వాడుకునే స్టీల్ వస్తువులతోనే కార్యక్రమాలు జరుపుకుంటాము *భూసారాన్ని తగ్గించే కృత్రిమ ఎరువులు, హానికారక వంట ఇంటి అంట్లు తోమే రసాయన సబ్బులు, వాషింగ్ సర్ఫుల వాడకాన్ని తగ్గిస్తూ భూమాతను కాపాడుకుందాం అంటూ సభ్యులతో ప్రమాణం చేయించిన శారదా నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి KLN Rao. ఈ సందర్భంగా...భూమిని మనం కాపాడితే,ఆ భూమాత మనల్ని రక్షిస్తుంది.. చెట్టు,చేమ, జంతుజాలం, అన్నింటికీ ఆహార సంపదలను సమకూర్చి కన్నతల్లిలా తనలో సృష్టి అంతటినీ ఇముడ్చుకునేది భూమాతే.... జీవం ఉన్నా, కాలధర్మం చెందినా, పక్షపాత ధోరణి లేకుండా సమానత్వాన్ని చూపేది భూమాతే.... మహదాకాశం నుండి మార్పులు చ...